చిర్ల జగ్గారెడ్డికి ప్రమోషన్
కాకినాడ, ఆగస్టు 19,
వైసీపీ ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి జగన్ ప్రమోషన్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి విప్ హోదా కల్పించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. పార్టీకి విధేయుడిగా ఉండటంతో పదవి దక్కింది. ప్రభుత్వ నిర్ణయం తెలియడంతో రావులపాలెంలోని పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. పార్టీ కార్యాలయం దగ్గర కార్యకర్తలు జగ్గిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా పనిచేస్తానని జగ్గిరెడ్డి అన్నారు. ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు స్వీకరించినచిర్ల జగ్గిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తనను చీఫ్ విప్‌గా నియమించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సొంత ఊరు గోపాలపురం. 2001లో కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కాంగ్రెన్ తరపున ఒకసారి, జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో వైఎస్సార్‌సీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. జగ్గిరెడ్డి తండ్రి చిర్ల సోమసుందర్ రెడ్డి 1983లో టీడీపీ, 1989లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు.