YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

సర్వర్లతో సమస్య జీతాలకు ఇబ్బందే

సర్వర్లతో సమస్య జీతాలకు ఇబ్బందే

ఖజానా శాఖలో నూతన విధానం ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో గుబులు పుట్టిస్తోంది. మొన్నటి దాకా ప్రతినెలా ఒకటో తేదీ టంచనుగా జీతాలు అందుతుండగా రెన్నెళ్లుగా ఆలస్యమవుతున్నాయి. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ కాంప్రహెన్సివ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (సీఎఫ్‌ఎంఎస్‌) విధానం అమల్లోకి రావడం వల్ల జిల్లాలో55 శాతం మంది ఉద్యోగులు జీతాలపై ప్రభావం పడింది. ఈవిధానంలో కుబేర్‌ స్టాప్‌వేర్‌ను అనుసంధానం చేయడంతో ఏర్పడిన ఇబ్బందులే దీనికి ప్రధాన కారణం. దీంతోపాటు అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్ల బిల్లులు నిలిచిపోయాయి. ఈపరిస్థితిపై ఉద్యోగువర్గాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈవిధాన పై సరైన అవగాహన కల్పించకుండా అమల్లోకి తీసుకురావడమే ప్రధాన అవరోధంగా మారిందనే విమర్శలు ఉద్యోగుల నుంచి వ్యక్తవుతున్నాయి.జీతాల చెల్లింపులో సాంకేతికను ప్రవేశపెట్టి పారదర్శకతను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ‘సమగ్ర ఆర్థిక చెల్లింపుల వ్యవస్థ’ సీఎఫ్‌ఎంఎస్‌ను  తీసుకొచ్చింది. దీనిపై డ్రాయింగ్‌ అధికారులకు  సరైన అవగాహన లేదు. ఫలితంగా క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తుతున్నాయి.సర్వర్‌ పని చేయకపోవడం, వివరాలు అప్‌లోడ్‌ చేసేందుకు ఎదరువుతున్న సాంకేతిక పరమైన ఇబ్బందులపై కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే వారి నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా కొత్త విధానాన్ని అమలు చేసే ముందు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఉన్నఫళంగా అమలు చేయడంతోనే సమస్య తలెత్తుతోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు 34,900 మంది ఉండగా, టీచర్లు 16,300 మంది దాకా ఉన్నారు. స్థానికంగా ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వేదికగా రాజధానిలో కాల్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేశారు. అయినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. వేలాదిమంది ఉద్యోగ, ఉపాధ్యాయుల వివరాలు సీఎఫ్‌ఎంఎస్‌లోకి మార్చాల్సి ఉంది. ఈ మార్పులు చేసేందుకు కొత్త సర్వర్‌ సరిగా పని చేయడం లేదు. వివరాలు మార్పుచేసి బిల్లులు పెట్టాలంటే సమయం చాలా పడుతుందని డీడీఓలు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో జీతాలపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.విద్యాశాఖ ఒక్కటే కాదు దాదాపు అన్ని శాఖల ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. అయితే ఎక్కువమంది ఉద్యోగులున్న విద్యాశాఖలో ఈ గందరగోళం మరింత ఎక్కువగా ఉంది. మరోవైపు కొత్త విధానంపై అవగాహన లేకపోవడం ఓ సమస్య అయితే సమస్యల పరిష్కారానికి రాజధానిలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినా ప్రయోజనం లేదని డీడీఓలు వాపోతున్నారు.  సిఎఫ్‌ఎంఎస్‌ విదానంపై సరైన శిక్షణ లేకపోవడం, మౌలిక సౌకర్యాలు కల్పించకుండా ప్రవేశపెట్టడంతో అన్ని వర్గాలకు ఇబ్బందికరంగా మారింది. ఉద్యోగులకు 1వ తేది అందాల్సిన జీతాలు ఈసారి పూర్తిస్థాయిలో అందలేదు. దీనిపై సరైన శిక్షణిచ్చి సమగ్రంగా అమలు చేస్తే ఇబ్బందులు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఖాతారు చేయలేదు. ఆర్థిక వ్యవస్థలో సరికొత్త అడుగులు అధికారులు ఆశించారు. అందుకే ఎట్టిపరిస్థితుల్లోను అపేది లేదని, ఆమలు చేయాల్సిందేనని గడువు విధించింది. ఉద్యోగ సంఘాల సూచనలు బేఖాతరు చేశారు.విశాఖ జిల్లాలో 74వేల మందిపైగా ఉద్యోగులు ఉండగా, ఈవిధానానికి అనుసంధానం లేని కొన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకు జీతాలందాయి. 70శాతం మందికి అందలేదని ఉద్యోగసంఘాలు చెబుతున్నాయి. అధికార్లు అత్యుత్సాహంతో ఈవిధానాన్ని ప్రవేశపెట్టారని, ఈవిధానం అమల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించలేదని, దీనివల్ల ఒక్క ఉద్యోగులే కాకుండా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయాసంఘాల నాయకులు చెబుతున్నారు. ఈవిధానం సమర్ధవంతంగా అమలు చేయాలంటే సిఎఫ్‌ఎంఎస్‌ విధానం తెలిసిన నిపుణులు జిల్లాకు ఒకరిని లైజైన్‌ అధికారిగా నియమిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. ఈవిధానం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నా సమర్ధవంతంగా అమలు చేయలేకపోవడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే పరిస్థితి ఏర్పడిందని ప్రభత్వ ఉద్యోగు సంఘాల నాయకులు చెబతున్నారు. రాత్రికి రాత్రే ఈవిధానం ప్రవేశపెట్టడం వల్ల గ్రామాల్లో పంచాయతీలు, వివిధ స్థానిక సంస్థలో పనిచేసే ఎందరో చిన్నస్థాయి ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పంచాయతీ ఉద్యోగులకు ఐదునెలలుగా జీతాలు రాకపోవడం, మున్సిపాలిటి, మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పనిచేసే ఉద్యొగులకు మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో వారి ఇబ్బందులు వర్ణనాతీతంన. ఓవైపు ఆర్దిక అంక్షలు మరోవైపు సీఎఫ్‌ఎంఎస్‌ విధానమే దీనికి కారణాలుగా చెబుతున్నారు. పంచాయతీలో పనిచేసే చిన్నస్థాయి ఉద్యోగులు జీతాలు కోసమే ఎదురుచూస్తుంటారు. వారికి ట్రెజరీ బిల్లులు రాకపోవడంతో జీతాలు ఇచ్చేపరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా ఉపాధ్యాయ వర్గాలతోపాటు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, పశుసంవర్ధకశాక, జిల్లా పరిషత్‌ వంటి సంస్థలలో ఉద్యోగులకు జీతాలు ఇంకా అందలేదు.

Related Posts