YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వామ్మో...గాలి దుమరమా... రైతులకు కోటికి పైగా నష్టం

 వామ్మో...గాలి దుమరమా... రైతులకు కోటికి పైగా నష్టం

నెల రోజుల పరిధిలో రెండు సార్లు  కురిసిన  అకాలవర్షాలు రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పంటతోపాటు ఉద్యాన పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల జిల్లాల్లº మామిడికి ఎక్కువ నష్టం జరిగింది. మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో వరిపంటలు దెబ్బతిన్నాయి ఉమ్మడి జిల్లాలో రూ.కోటికి పైగానే రైతులకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు నివేదికలను తయారు చేశారు. గద్వాల జిల్లాలో 488 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కొల్లాపూర్‌, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌ ప్రాంతాల్లో మామిడి పంటలు బాగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 496 ఎకరాల్లో మామిడి రైతులకు నష్టం ఏర్పడింది. ఈ ప్రాంతాల్లోనే మామిడితోటలు ఎక్కువగా ఉన్నాయి. కాయలు రాలటంతోపాటు చెట్లు విరిగిపడ్డాయి. సుమారు 56 ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. అక్కడక్కడా వడగళ్ల వర్షం పడి చేతికి వచ్చిన వరి నేలకు ఒరిగింది. వనపర్తి జిల్లాలో ఆత్మకూరు వైపు కొంత ప్రభావం కనిపించింది. గత నెల ఈ జిల్లాలోని అయిదు మండలాల్లోని 12 గ్రామాల్లో 805 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గురువారం నాటి గాలీవానల వల్ల ఎక్కువగా విద్యత్తుసంస్థకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 134 స్తంభాలు విరిగిపడినట్లు అధికారులు గుర్తించారు. మరో 14 కిలోమీటర్ల దూరం కేబుల్‌ పాడుకావటం, చిన్నపాటి సామగ్రి విరిగిపడటంతో నష్టం వాటిల్లింది. పలుచోట్ల వ్యవసాయ మార్కెట్లలో వేలాదిగా ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. ప్రధానంగా రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసినవే ఇందులో ఎక్కువగా ఉన్నాయి.ఇందులో ఒక్క మామిడే 452 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు గుర్తించారు. 26 ఎకరాల్లో అరటి, 10 ఎకరాల్లో మునగ పంటలు పాడయ్యాయి. వీటితోపాటు సుమారు 67 విద్యుత్తు స్తంభాలు, ఎనిమిది కిలోమీటర్ల మేర కేబుల్‌ ఈ జిల్లాలో దెబ్బతిన్నట్లు విద్యుత్తు అధికారులు గుర్తించారు. వీటన్నింటి విలువ సుమారు రూ.30 లక్షలకు పైగానే ఉంటుందని వారు పేర్కొంటున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 48 ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నట్లు అధికారులకు సమచారం వచ్చింది. 82 ఎకరాల్లో మామిడితోటలు దెబ్బతిన్నాయని ఉద్యానశాఖ అధికారి సరోజ వెల్లడించారు. ఇప్పటివరకు చూస్తే.. మహబూబ్‌నగర్‌ జిల్లాలో గత నెల కురిసిన వడగళ్ల వర్షంతో కలిపి మొత్తం 1,200 ఎకరాల్లో మామిడి, దానిమ్మ, బత్తాయి తోటలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇంకా క్షేత్రస్థాయి నుంచి పూర్తిస్థాయి నివేదికలు అందాల్సి ఉందని ఆమె తెలిపారు. గడచిన నెల రోజుల్లో రెండుమార్లు విరుచుకుపడ్డ వడగళ్ల వర్షాలు, ఈదురు గాలులను తలచుకొని రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికి వచ్చిన పంటలు కళ్ల ముందే దెబ్బతినటం చూసి వారు విలవిలలాడుతున్నారు.

Related Posts