YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

పిలిస్తే పలికే దైవం శ్రీ మద్ది ఆంజనేయస్వామి

పిలిస్తే పలికే దైవం శ్రీ మద్ది ఆంజనేయస్వామి

పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం, గురువాయిగూడెం గ్రామంలో గల తెల్ల మద్దిచెట్టు తొర్రలో స్వయంభువులై వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి చరిత్ర అపూర్వం. ఉపాసనాపరులు, వయో వృద్ధులు, చరిత్రకారులు చెప్పిన విషయాలకు శాస్త్ర ప్రమాణం చేస్తే, మద్దిచెట్టుకు, శ్రీ ఆంజనేయ స్వామి వారికి గల సంబంధం తెలుస్తుంది. గర సంహిత, పద్మ పురాణం, శ్రీ రామాయణాలలో చెప్పిన ప్రకారం స్థల పురాణం ఈవిధంగా వుంది. • త్రేతాయుగంలో మద్వాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. రావణ సైన్యంలో ఇతడు రాక్షసప్రవృత్తితో ప్రవర్తించక, చక్కటి - ఆధ్యాత్మిక చింతనతో జీవిస్తుండేవాడు. కాలక్రమంలో రామ రావణ యుద్ధం వచ్చింది. ఈ యుద్ధంలో శ్రీరామునివైపు నిలిచి పోరాడుతున్న ఆంజనేయ స్వామివారిని చూసి మనస్సు చలించి, అస్త్రసన్యాసం చేసి, 'హనుమా, హనుమా' అంటూ మద్వాసురుడు తనువు చాలించాడు. అనంతరం ద్వాపరయుగంలో మధ్యకుడుగా జన్మించి సదాచార సంపన్నుడై నిత్యం భక్తిభావనతో ప్రవర్తించేవాడు. ఆ కాలక్రమంలో కౌరవ, పాండవుల అద్దం వచ్చింది. ఆ యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడుతున్న మంతుడు అర్జునుని జెండాపై గల శ్రీ ఆంజనేయస్వామిని చూసి పూర్వజన్మ జ్ఞాపకం వచ్చి వెంటనే ప్రాణత్యాగం చేసాడు. అనంతరం కలియుగంలో మధ్వుడుగా జన్మించి తపస్సు చేసుకుంటూ సంచరించసాగాడు. అలా తిరిగి తిరిగి ఎర్రకాల్వ ఒడ్డుకు వచ్చి తపస్సు చేసుకోవడానికి - అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొన్నాడు. ప్రతిదినం కాలువలో స్నానం చేసి, శ్రీ ఆంజనేయ స్వామివారి కొరకు తపస్సు చేయ సాగాడు.. అలా కొంతకాలం తపస్సు చేసిన మధ్వుడు మహర్షి అయ్యాడు. వయోభారంతో మధ్వమహర్షి అడుగులు తడబడ సాగాయి. ఒకరోజు మహర్షి స్నానం చేసి ఒడ్డుకు చేరబోయి అడుగులు తడబడటంతో కాలువలో పడబోయాడు. ఇంతలో ఎవరో ఆపినట్లు ఆగిపోయాడు. ఆశ్చర్యం! ఒక వానరం మహర్షి చేయి పట్టుకుని ఒడ్డుకు తీసుకువచ్చింది. సపర్యలు చేసి ఒక పండు తినమని ఆహారంగా ఇచ్చింది. మహర్షి యథాప్రకారం ,జపం చేయసాగాడు. ప్రతిరోజు కాలువలో స్నానం చేయించి, ఒక ఫలం తనకు ఆహారంగా ఇస్తున్న వానరం గురించి మహర్షి ఆలోచించలేదు, పట్టించుకోలేదు. ఇలా కొంతకాలం జరిగింది. " - . ఒకరోజు తనకు సపర్యలు చేస్తున్న వానరాన్ని తదేకదృష్టితో చూసిన మహర్షి ఆ వానరం సాక్షాత్తు ఆంజనేయస్వామిగా గుర్తించి, ముగ్ధుడై “స్వామీ! ఇంతకాలం మీతో సపర్యలు చేయించుకున్నానా? ఎంతటి దౌర్భాగ్యుడను. సాక్షాత్తు స్వామి వారిచే సపర్యలు చేయించు కున్న పాపాత్ముడను. . నేను జీవించి ఉండటం అనవసరం అని విలపించసాగాడు. స్వామి ప్రత్యక్షమై 'మధ్వా! ఇందులో నీ తప్పు ఏమీలేదు. నీ స్వామిభక్తికి నేను మెచ్చి స్వయంగా వచ్చి నీకు సేవ చేసాను. అందువల్ల నువ్వు విచారించక ఒక వరం కోరుకో" అన్నాడు. మధ్వుడు వెంటనే “స్వామీ! మీరు ఎల్లప్పుడూ నాచెంత ఉండేలా వరం ప్రసాదించండి” అని ప్రార్థించాడు. అతను - అప్పుడు స్వామి, “నువ్వు మద్దిచెట్టుగా అవతరించు. నేను నీ సమీపంలో శిలారూపంలో ఎక్కడాలేని విధంగా ఒక చేతిలో ఫలం, - మరొక చేతిలో గదతో వెలుస్తాను. భక్తులంతా మనిద్దరి పేర్లతో - కలిపి నన్ను 'శ్రీ మద్ది ఆంజనేయస్వామి' గా పిలుస్తారు” అని " అనుగ్రహించాడు. సాటి నుండి ఇక్కడి ఆంజనేయస్వామివారు 'శ్రీ - మద్ది ఆంజనేయస్వామి' గా పిలువబడుతూ, పేరు ప్రఖ్యాతులు పొంది - భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆ - మొదట శ్రీ స్వామివారి విగ్రహం మోకాలు వరకు కనిపించేది, - 1976 సంవత్సరంలో శ్రీ జలగం ప్రసాదరావు దంపతులచే ఆలయానికి శంకుస్థాపన చేయబడి, ఆలయం నిర్మాణం చేయటం జరిగింది. ఆ రోజుల్లో జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ గా  పనిచేసిన శ్రీ మంతెన వరహాలరాజు గారి మాతృమూర్తి శ్రీమతి భానుమతీదేవి స్వామి వారి వద్దకు తరచూ వస్తూండేవారు. ఒకరోజు వారిమీదకు స్వామివారు పూని, ఆలయానికి ద్వారం ఏర్పాటు చేసి, చెట్టు శిఖరంలా ఉండేలాగా గర్భాలయ నిర్మాణం చేయమని ఆజ్ఞ ఇచ్చారు. మన దేశంలో శిఖరం లేని గర్భాలయం ఇదొక్కటే. " - శ్రీ స్వామివారి నిత్యార్చన, దర్శన వేళలు ఆ దేవస్థానంలో శ్రీ స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం నాడు తెల్లవారుఝామున గం. 4.80 ని.ల నుండి శ్రీస్వామివారికి సుప్రభాత సేవ, నిత్యార్చనలతో పూజాది కార్యక్రమాలు ఆరంభించ బడ ఆయి. మధ్యాహ్నం గం. 12-00 లకు శ్రీ స్వామివారికి మహానివేదన " జరుపబడతాయి. ఉదయం గం. 6-00 నుండి, మధ్యాహ్నం గం. 1-00 వరకు శ్రీ స్వామివారి సర్వదర్శనం. అనంతరం మధ్యాహ్నం గం. 3-00 నుండి రాత్రి గం. 9-00 వరకు భక్తుల -- సందర్శనార్థం నిరంతరాయంగా తెరచి ఉంచబడుతుంది. మంగళవారం నాడు తప్ప మిగతా రోజులలో తెల్లవారుఝామున గం, 5.00 ని.ల నుండి శ్రీ స్వామివారికి సుప్రభాత సేవ, నిత్యార్చన - లతో పూజాది కార్యక్రమాలు - 1 ఆరంభించబడతాయి. మధ్యా హ్నం గం. 12-00 లకు శ్రీ స్వామి వారికి మహానివేధన - జరుపబడతాయి. ఉదయం - గం 6-00 నుండి మధ్యా ఆహ్నం గం. 1-00 వరకు శ్రీ స్వామివారి సర్వదర్శనం. ఈ అనంతరం మధ్యాహ్నం గం.8-00 నుండి రాత్రి గం.9-00 వరకు భక్తుల నందర్శనార్థం నిరంత రాయంగా తెరచి ఉంచబడుఉంచబడును.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts