YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నయా ప్లాన్ తో కేసీఆర్ ఫాలోవర్స్ కాదు సెట్టర్స్ నినాదం

నయా ప్లాన్ తో కేసీఆర్ ఫాలోవర్స్ కాదు సెట్టర్స్ నినాదం

హైదరాబాద్, ఆగస్టు 20, 
మేం ట్రెండును ఫాలో అవ్వం.. సెట్ చేస్తాం.. అంటూ ఓ సినిమా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ డైలాగ్ చెబుతారు.. ఇది స‌రిగ్గా స‌రిపోయే వ్య‌క్తం ఎవ‌రైనా ఉన్నారంటే అది తెలంగాణ సీఎం, గులాబీ ద‌ళ‌ప‌తి కె.చంద్ర‌శేఖ‌ర్ రావే.. తెలంగాణ రాజ‌కీయాల్లో గ‌త రెండు ద‌శాబ్దాలుగా అయ‌నే ట్రెండ్ సెట్ట‌ర్. అయ‌న ఏం చేసినా వినూత్నమే… మెద‌ట అసాధ్యం అనిపించేలా అయ‌న ప‌థ‌కాలుంటాయి.. త‌ర్వాత అంద‌రు ఫాలో అయ్యేలా రిజ‌ల్ట్ ఉంటుంది. ప‌రిపాల‌న‌లో అయినా రాజ‌కీయాల్లో అయినా… తాజాగా అన్నిపార్టీలు జై భీమ్ నినాదం ఎత్తుకునేలా ఎత్తులు వేసి విజ‌యం సాధించారు కేసీఆర్. జై భీమ్ నినాదం కొత్త కాదు.. కానీ, ద‌ళిత‌బంధు ప‌థ‌కం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా కేసీఆర్ జై భీమ్‌, జై తెలంగాణ అంటూ నిన‌దించ‌డం పెద్ద చ‌ర్చ‌గా మారిపోయింది.ఇక‌, కేసీఆర్ 2001లో తెలంగాణ నినాదం ఎత్తుకున్న‌ప్పుడు అంతా రాజ‌కీయ ప‌బ్బం కొసం కొత్త వేదిక అనుకున్నారు. అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి కూడా లైట్ తీసుకుంది తెలంగాణ ఉద్య‌మాన్ని… కాని కొద్ది రోజుల‌కే అన్ని పార్టీలు తెలంగాణ అంశాన్ని త‌మ ఎజెండాలో పెట్టుకునే ద‌శ‌కు తీసుకెళ్లారు ఉద్య‌మ‌నేత కేసీఆర్. పార్టీల‌క‌తీతంగా నేతంలంద‌రితో జై తెలంగాణ అనిపించారు. 24 గంట‌ల ఉచిత క‌రెంట్‌ను అన్న‌ప్పుడు ఇది అసాధ్యం అన్న‌వాళ్లే అంతా. అప్పుడున్న తెలంగాణ ప‌రిస్థితి కూడా అలాంటిదే. కాని దాన్ని సుసాధ్యం చేస్తూ గ‌త ఏడేళ్లుగా క‌రెంటు అందింస్తోంది తెలంగాణ ప్ర‌భుత్వం. గ‌తంలో క‌రెంటు పేరుతో ఉధ్య‌మాలు జ‌రిగిన తెలంగాణ‌లో ఇప్పుడు విద్యుత్ అంశం కరంట్ టాపిక్‌లో లేకుండా పోయింది. చాలా రాష్ట్రాలు విద్యుత్ విష‌యంలో కేసీఆర్‌ను ఫాలో అయ్యాయి.మ‌రోవైపు దేశంలోనే సంచ‌ల‌నంగా మారిన రైతుబంధు ప‌థ‌కంలో ఖ‌చ్చితంగా కేసీఆర్ ట్రెండ్ సెట్ట‌ర్. ఎక‌రాకు ప‌దివేలు ఇవ్వ‌డం సాధ్యంకాని ప‌నంటూ కొట్టిపారేసిన వాళ్లంతా నోర్లు వెల్ల‌బెట్టుకునేలా రైతు బంధు అమ‌లుచేస్తున్నారు. అంతేకాదు రైతు బంధును అధ్య‌య‌నం చేసి ఒడిశా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లాంటి రాష్ట్రాలే కాదు…ఏకంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వం కూడా రైతు పెట్టుబ‌డి సాయాన్ని అమలుచేస్తుంది. ద‌ళిత బంధు కూడా కేసీఆర్ ప్రవేశపెట్టిన మ‌రో సంచ‌ల‌న ప‌థ‌కమే… ద‌ళిత బంధు కేవ‌లం సంక్షేమ ప‌థ‌కం మాత్ర‌మే కాదు ఇదొక ఉద్య‌మం అంటూ కేసీఆర్ ప్ర‌క‌టించారు. కేసీఆర్ జై భీమ్ అన‌డంతో అటు ప్ర‌తిప‌క్షాలు కూడా ఆ నినాదాన్ని ఎత్తుకున్నాయి. కాంగ్రెస్ ద‌ళిత దండోరా ప్ర‌క‌టించింది. మ‌రోవైపు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కూడా అదే ఎజెండాతో బీఎస్సీలో చేరారు. బీజేపీ కూడా ద‌ళిత సంక్షేమంపై అంశాల వారిగా ఎజెండా రూపొందించుకుంటుంది. ఇలా తెలంగాణలో రాజ‌కీయ వ్య‌వ‌స్థ మొత్తాన్ని జై భీమ్ బాట ప‌ట్టించారు కేసీఆర్

Related Posts