YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

పాక్ ఉగ్రవాదులపై అమెరికా డ్రోన్ దాడి

పాక్ ఉగ్రవాదులపై అమెరికా డ్రోన్ దాడి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌కు గట్టి సందేశంలాంటి హెచ్చరిక పంపించారు. పాకిస్థాన్ గడ్డపైనున్న ఉగ్రవాద సంస్థలపై స్వయంగా చర్యలు ప్రారంభించారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్‌వర్క్‌పై అమెరికా డ్రోన్ దాడి చేసినట్లు తెలుస్తోంది. హక్కానీ నెట్‌వర్క్ టాప్ కమాండర్ ఈ దాడిలో మరణించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.

డొనాల్డ్ ట్రంప్ కొద్ది నెలలుగా హెచ్చరిస్తున్నప్పటికీ పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన సంగతి తెలిసిందే.

పాకిస్థాన్ భద్రతాధికారులు ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం వాయవ్య పాకిస్థాన్‌లో ఓ ఇంటిపై డ్రోన్ దాడి జరిగింది. ఇది అమెరికా తీసుకున్న చర్య అని పాకిస్థాన్ అనుమానిస్తోంది. ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు ఆఫ్ఘన్ తాలిబాన్‌తో సంబంధాలున్న హక్కానీ నెట్‌వర్క్‌కు చెందినవారు.

డాపా మమోజాయ్‌ అనే గ్రామంలో ఉన్న ఈ ఇంటిపై రెండు క్షిపణులతో దాడి జరిగినట్లు ఈ అధికారులు తెలిపారు. ఈ గ్రామం ఫెడరల్ ప్రభుత్వం పరిపాలిస్తున్న గిరిజన ప్రాంతంలో ఉందని చెప్పారు. ఈ దాడిలో ఉగ్రవాదులు అహ్‌సాన్ ఖొరాయ్, నాజిర్ మెహమూద్ మరణించినట్లు తెలిపారు. వీరిద్దరూ హక్కానీ నెట్‌వర్క్‌కు చెందినవారని తెలిపారు.

Related Posts