YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సమ్మర్ లో పండ్లకు ప్రాధాన్యం ఇవ్వండి

సమ్మర్ లో పండ్లకు ప్రాధాన్యం ఇవ్వండి

ఎండాకాలంలో చాలా త్వరగా తెల్లవారుతుంది. పగటి నిడివి ఎక్కువగా ఉంటుంది. అంటే తొందరగా సూర్యోదయం అవుతుంది. ఎక్కువ ఎండ భూమిని చేరుతుంది అంటే ఎక్కువ డి విటమిన్ దొరికేందుకు అవకాశం ఎక్కువ అని అర్థం. కాసేపు ఎండలో గడిపితే శరీరానికి అవసరమైన డి విటమిన్ శరీరం తయారు చేసుకోగలుగుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. డి విటమిన్ ఏజింగ్ ప్రక్రియ వేగాన్ని కూడా తగ్గిస్తుంది. చలికాలంతో పోలిస్తే వేసవిలో గుండె పోటు వచ్చే ఆస్కారం తక్కువ. దీనికి కారణాలేమిటో ఇంకా ఇదమిద్ధంగా తెలియకపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాన్ని నిపుణులు గుర్తించారు. నిజానికి మిగతా సంవత్సరకాలంతో పోలిస్తే మొత్తంగా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందనేది వాస్తవం. కాబట్టి ఎండలు మండిపోతున్నాయని విసుగు చెందకుండా వీలైనంత వరకు ఆరోగ్యంగా ఉంటున్నామన్న విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఆనందంగా, ఉత్సాహంగా గడపండి. ఎండాకాలంలో పండ్లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ఎండల్లో కడుపునిండా భోంచెయ్యడం కంటే పుచ్చపండు ముక్కలు తినడంలో ఉండే ఆనందమే వేరు. ఈ కాలంలో మాత్రమే దొరికే వరం మామిడి పండు. మామిడి పండు రసం ఊరించకుండా ఉంటుందా. అంతే కాదు అనాస, పనస, ద్రాక్ష, కర్బూజ వంటి రకరకాల పండ్లు ఈ కాలంలో అందుబాటులో ఉంటాయి. ఎక్కువ పండ్లు తీసుకోవడం అంటే శరీరంలోకి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లను చేర్చడమే. ఇవి ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలు చేసేవే. అంతేకాదు విటమిన్ సి, ఇ పుష్కలంగా శరీరంలోకి చేరుతుంది. ఎక్కువ చెమట అని విసుగొద్దు. చెమట ఎక్కువగా వస్తుంది అంటే మీ శరీరం మరింత చల్లబడుతుందని అర్థం. అంతేకాదు చెమట ద్వారా మీ శరీరంలో చేరిన బాక్టీరియా కూడా బయటికి వెళ్లిపోతుంది. అంతేకాదు చర్మం మీద, స్వేద రంధ్రాల్లో పేరుకున్న మురికి, దుమ్ము, ఎక్కువగా చేరిన జిడ్డు వంటి వన్నీకూడా బయటికి వెళ్లిపోయి చర్మం క్లియర్ అవుతుంది. అంతేకాదు ఎక్కువ సమయం పాటు చెమట బయటకు వస్తుంటే శరీరంలో ఎండార్ఫిన్ల విడుదల పెరుగుతుంది. అందువల్ల ఉల్లాసకర భావన కూడా కలుగుతుంది. ఎండ తక్కువగా ఉండే ఉదయం, సాయంత్ర సంధ్యల్లో తప్పనిసరిగా ఒక అరగంట పాటు ఆరుబయట ప్రకృతిలో సమయం గడపగలిగితే మానసిక శారీరక ఆరోగ్యాలకు చాలా మంచిది. ఇది బీపీ, షుగర్ స్థాయిలు అదుపులో ఉండేందుకు తోడ్పడుతుంది. తాజా గాలి పీల్చడం వల్ల సెరొటోనిన్ అధిక మొత్తంలో విడుదలై ఆనందంగా కూడా ఉంటుంది. ఆనందం ఆరోగ్యానికి పునాది. కుటుంబంతో కలిసి కనీసం వారంలో ఒక అరగంట పాటు ప్రకృతిలో గడిపితే బాంధవ్యాలు కూడా బలపడతాయి.

Related Posts