ఆలయాలకు పోటెత్తిన భక్తులు
భీమవరం
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని ప్రత్యేకంగా వరలక్ష్మిదేవిగా అలంకరణ చేసారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. భీమవరం మావుళ్ళమ్మ దర్శనానికి రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు వస్తారు. నిత్యం సుమారు 70 కేజీల బంగారు ఆభరణాలతో అమ్మవారు దర్శణం ఇస్తారు. కోరిన కోరికలను తీర్చే చల్లని తల్లిగా మావుళ్ళమ్మను భక్తులు కొలుస్తారు. మావుళ్ళమ్మను దర్శంచుకుంటే అంతా సుభిక్షంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. పంచారామ క్షేత్రం శ్రీ ఉమా జనార్ధన సోమేశ్వర ఆలయం లో అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా ప్రత్యేక పూలతో అలంకరించారు. గునుపూడి గ్రామదేవత శ్రీ లక్ష్మీ అమ్మవారిని ప్రత్యేకంగా పూలతో అలంకరించి కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కు ఏవిదమైన అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ అధికారులు.