YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సూర్యాపేట జిల్లాలో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సూర్యాపేట జిల్లాలో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సూర్యాపేట జిల్లాలో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సూర్యాపేట
 ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా గురువారం రాత్రి  సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకున్న కేంద్ర పర్యాటక శాఖ, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్థానిక వాణిజ్య భవన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.  శుక్రవారం ఉదయం  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు ఇతర బిజెపి  నాయకులతో కలిసి  కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తరువాత అయన  జాతీయ అవార్డు గ్రహీత మున్సిపల్ కార్మికుల రాలు మార్థమ్మఇంట్లో ఆల్ఫాహారం తీసుకున్నారు. అనంతరం   ఇటీవల కరోనా సమయంలో  ఒక్క రోజు కూడా  సెలవు పెట్టకుండా  విధులు నిర్వహించిన  మున్సిపల్ కార్మికులు  మార్తమ్మ  కు కేంద్ర ప్రభుత్వం బెస్ట్ కోవిడ్ వారియర్ గా ఆమెకు ఢిల్లీలో అవార్డును అందజేసింది.. స్థానిక చింతలచెరువు లో  ఆమెను అభినందించడానికి కేంద్ర మంత్రి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో అల్పాహారం స్వీకరించారు. ఎలాంటి భయం లేకుండా కోవిడ్ సమయంలో విధులు నిర్వహించినందుకు ఆమెను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
 అనంతరం మీడియాతో అయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజా ఆశీర్వాద యాత్ర. యాత్రలో జాతీయ పారిశుధ్య కార్మికురాలు మెరుగు మార్తమ్మ ను కలవడం సంతోషంగా ఉంది. కరోనా కాలంలో ఒక్కరోజు కూడా పని మానకుండా ప్రజల ఆరోగ్యం కోసం పని చేసిన మారతమ్మ అభినందనీయరాలు. దేశ వ్యాప్తంగా కరోనా ఉచిత వాక్సిన్లను అందిస్తున్నాం.  త్వరలోనే చిన్నారులకు వాక్సిన్లు ఇస్తాం. ప్రజలు బాధ్యతగా వాక్సిన్లను తీసుకుని కరోనాని ఓడించాలి. కరోనా కాలంలో బీదలను ఆదుకునేందుకు దీపావళి వరకు ఉచిత బియ్యం అవసరమైతే ఇంకా పొడిగిస్తాం. కరోనా వారియర్లకు 50 లక్షల ఇన్సూరెన్స్ అందిస్తున్నాం. జర్నలిస్టులకు 5లక్షల భీమా ఇస్తున్నాం. కరోనా మృతుల పిల్లల చదువుల బాధ్యత కేంద్రం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలి. కరోనా కష్ట కాలంలో పని చేసిన వారియర్లందరికి పాదాభివందనమని అన్నారు.

Related Posts