పద్మావతి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం
తిరుపతి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీకృష్ణ ముఖమండపంలో వరలక్ష్మీవ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. విష్వక్సేనారాధనతో ప్రారంభించి పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని సంప్రదాయ పుష్పాలతో అలంకరించి ఆరాధించారు.అనంతరం శ్రీ వరలక్ష్మీ వ్రతం మహత్యాన్ని, ఆచరించవలసిన విధానాన్ని ఆగమ పండితులు శ్రీనివాసాచార్యులు తెలియజేశారు.తరువాత ఐదు రకాల కుడుములతో పాటు 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతాన్ని ముగింపచేశారు.