ఆధార్‌కార్డు నంబర్ మార్పులాంటి వాటికి ఇక ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు
ఫోన్‌చేస్తే తపాలా సిబ్బందే ఇంటికి వచ్చి సమయంలో అనుసంధానం
హైదరాబాద్ ఆగష్టు 20
ఆధార్‌కార్డుతో మొబైల్ నెంబరు అనుసంధానం/నంబర్ మార్పులాంటి వాటికి ఇక ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. ఫోన్‌చేస్తే చాలు తపాలా సిబ్బంది ఇంటి కే వచ్చి పని చేస్తారు. తపాలాశాఖ అందుబాటులోకి తెచ్చిన ఈ సేవ ఇప్పుడు జనాన్ని బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ప్రతి పనికీ ఆధార్ అవసరమవుతోంది. దానికి సంబం ధించి ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఇందుకు ఆధార్‌తో ఫోన్ నంబర్ అనుసం ధానం తప్పనిసరి. ఈ పనికి ఆధార్ కేంద్రానికి వెళ్లి అక్కడ క్యూలో నిలబడి పని చేయించుకోవాల్సి వస్తోంది. పనులు మాని మరీ ఆధార్ కేంద్రానికి వెళ్లాలి.కానీ, ఈ ఇబ్బంది లేకుండా, ఫోన్‌చేస్తే తపాలా సిబ్బందే ఇంటికి వచ్చి మనకు అనుకూలమైన సమయంలో అనుసంధానం చేసి వెళ్తారు. ఇప్పటికే నంబర్ అనుసంధానమై ఉన్నప్పుడు.. ఫోన్ నంబరు మారినా, కొత్త నంబర్‌తో అనుసంధానించుకోవాలని అనుకున్నా తపాలా సిబ్బంది ఆ పనిచేసి వెళ్తారు. ఇందుకు ఒక్కో అనుసంధానానికి రూ.50 చొప్పున చార్జి చేస్తారు. సంబంధిత పోస్టాఫీసు పోస్టుమాస్టర్ లేదా పోస్‌్ధమేన్‌కు ఫోన్‌చేస్తే ఇంటికి వస్తారని తపాలాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.