YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హెల్త్ ప్రొఫైల్ కు టీఆర్ఎస్ సిద్దం

హెల్త్ ప్రొఫైల్ కు టీఆర్ఎస్ సిద్దం

హెల్త్ ప్రొఫైల్ కు టీఆర్ఎస్ సిద్దం
హైదరాబాద్, ఆగస్టు 20
ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ప్రజల ఆరోగ్య సమాచారం సేకరించే హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టుంది..తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ప్రజల ఆరోగ్య సమాచారం సేకరించే హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టుంది. సెప్టెంబర్ మొదటి లేదా రెండోవారం నుంచి ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో మొదలుపెట్టనున్నారు. ఆ తర్వాత దశలవారీగా రాష్ట్రమంతా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టులో భాగంగా వైద్యశాఖ అధికారులు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సర్వే నిర్వహించనున్నారు. బీపీ, షుగర్, ప్రాధమిక రక్త, మూత్ర పరీక్షలు చేస్తారు. ఒకవేళ అదనపు పరీక్షలు అవసరమయ్యేలా అనిపిస్తే సమీప PHC, TS డయాగ్నస్టిక్స్ సెంటర్లకు పంపిస్తారు. అలాగే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు రాలేనివారి కోసం సంచార వాహనాలను అందుబాటులో ఉంచుతారు. ఇందుకోసం కావాల్సిన పరికరాలను సమకూర్చడమే కాకుండా.. ప్రత్యేక సిబ్బందిని కూడా కేటాయించనున్నారు. ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరించి.. దాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. అటు ప్రతీ వ్యక్తికి ప్రత్యేక సంఖ్యతో కూడిన ఆరోగ్య గుర్తింపు కార్డును అందజేస్తారు.
కాగా, ప్రజల ఆరోగ్య సమాచారాన్ని క్షేత్రస్థాయిలో సేకరించడం ద్వారా వ్యాధిపోకడను త్వరగా గుర్తించవచ్చునని.. తద్వారా చికిత్స మరింత సులభతరం అవుతుందని వైద్యశాఖ అధికారులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఆ వ్యాధి ముదిరాక చికిత్స కోసం అయ్యే వ్యయభారం తగ్గుతుందని చెబుతున్నారు.

Related Posts