YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

2024 ఎన్నికల కోసం టీడీపీ మల్టీ స్టారర్

2024 ఎన్నికల కోసం టీడీపీ  మల్టీ స్టారర్

హైదరాబాద్, ఆగస్టు 21, 
చంద్రబాబు మంచి నాయకుడు మాత్రమే కాదు, అద్భుతమైన దర్శకుడు కూడా. అవును మామ ఎన్టీఆర్ నటనలో మేటి. ఆయన కూడా దర్శకత్వం వహించారు కానీ సినిమాలకే ఆ ప్రతిభ పరిమితం. చంద్రబాబు అలా కాదు, రాజకీయాల్లో నిర్దేశకత్వం వహించాలి అంటే ఆయన తరువాతనే ఎవరైనా. నాడు ఎన్టీయార్ సీఎం గా ఉన్న రోజులలో తెర వెనక దర్శకత్వం అంతా చంద్రబాబుగారిదే అని ప్రచారం జరిగింది కూడా. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల గురించి ఇప్పటి నుంచే చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఈసారి ఎట్టిపరిస్థితులలోనూ గురి తప్పకూడదు అన్నదే బాబు ఆలోచన.చంద్రబాబు వచ్చే ఎన్నికల గండాన్ని గట్టెక్కడానికి జూనియర్ ఎన్టీయార్ ని మరోమారు ఆశ్రయిస్తారని రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న మాట. క్యాడర్ పిలుస్తోంది అల్లుడూ అంటూ జూనియర్ ని తన రూట్లోకి తెచ్చుకుంటారు అంటున్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే జూనియర్ కి ఇప్పట్లో రాజకీయాలోకి వచ్చే ఆలోచన లేదు. దాంతో ఆ సానుకూల అంశాన్ని వాడేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారుట. భవిష్యత్తులో జూనియర్ రాజకీయాల్లోకి వచ్చినా కూడా తాత పెట్టిన పార్టీ ఉండాలి కదా అన్న సెంటిమెంట్ ని టచ్ చేసి మరీ ఆయన్ని పసుపు పార్టీ సారధ్యానికి ఆయన్ని ఒప్పిస్తారు అంటున్నారు.చంద్రబాబు ఇపుడు తనకు తానుగా జూనియర్ ని కలిశాను అన్నది ప్రచారంలోకి రాకుండా ఉండాలని చూస్తున్నారు. అంటే ఏదో ఒక కుటుంబ వేడుకలో జూనియర్ ని యాధాలాపంగా కలసినట్లుగా కలసి ఆయనను మచ్చిక చేసుకుంటారుట. నిజానికి అలాంటి వేడుక ఏదీ జరకపోయినా చంద్రబాబే దాన్ని క్రియేట్ చేయగల సమర్ధులు అంటున్నారు. తనకు ఇదే చివరి అవకాశమని, ఆ తరువాత తాను రాజకీయంగా రిటైర్ అవుతానని చెప్పడం ద్వారా జూనియర్ ఇటు వైపు మొగ్గు చూపేలా చేసుకోవాలన్నది చంద్రబాబు ఆలోచనట. జూనియర్ ఏ మాత్రం మెత్తబడినా చంద్రబాబు ప్లాన్ పండినట్లే అంటున్నారు.మరో వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనతో కూడా పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు పూర్తి సంసిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఆ దిశగా రెండు వైపుల నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయని అంటున్నారు. ఈ ధీమాతోనే పవన్ హ్యాపీగా తాపీగా సినిమాలు చేసుకుంటున్నారు అంటున్నారు. ఇక అటు పవన్ ఇటు జూనియర్ ఈ ఇద్దరినీ కలిపి మల్టీస్టార‌ర్ మూవీని 2024 లో జనాలకు చూపించడానికి చంద్రబాబు రెడీ అయిపోయినట్లే అంటున్నారు. పవన్ జూనియర్ వెండితెర మీద మెరవకపోయినా రాజకీయ తెర మీద మాత్రం ఒకే వైపు కనిపిస్తే మాత్రం రాజమౌళిని మించిన డైరెక్టర్ చంద్రబాబు అని అంతా ఒప్పుకోవాల్సిందే. మొత్తానికి తన మాస్టర్ ప్లాన్ కి చంద్రబాబు పదును పెడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Related Posts