శ్రీకాకుళం : జె.డి లక్ష్మి నారాయణ శ్రీకాకుళం లో చేస్తున్న పర్యటన ఈ రోజు తో ముగుస్తుంది. సహలాలపుట్టుగ గ్రామంలో పర్యటించిన లక్ష్మీనారాయణ గ్రామస్తులతో కలిసి పరిసరాలను శుభ్రం చేసారు. సహలాలపుట్టుగ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. సామాజికవర్గం కాదు సమాజమే ముఖ్యమని, విమర్శలు చేస్తున్నవారు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడాలని హితవు పలికారు.