YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బుచ్చయ్య ఎపిసోడ్ పాఠాలు

బుచ్చయ్య ఎపిసోడ్ పాఠాలు

రాజమండ్రి, ఆగస్టు 21, 
తెలుగుదేశం పార్టీలోనే కాదు. యావత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం.. కాక పుట్టిస్తోంది. ఆయన వినిపిస్తున్న ధిక్కార స్వరం.. టీడీపీలో ఉన్న లుకలుకలను బయటపెడుతోంది. “పెదబాబు పట్టించుకోవడం లేదు.. కనీసం చినబాబు అయినా పట్టించుకోకపోతే ఎలా” అని ఆయన ప్రశ్నిస్తున్న తీరు.. తీవ్ర చర్చనీయాంశమవుతోంది. 2014లో టీడీపీ గెలవడానికి.. 2019లో ఓడిపోవడానికి దారి తీసిన కారణాలను సైతం.. తాజా పరిణామం చర్చలోకి తీసుకువస్తోంది.కొన్నాళ్ల క్రితమే.. ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వీడియో ఒకటి లీక్ అయ్యింది. లోకేశ్ ను టార్గెట్ చేస్తూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు.. ఇప్పటికీ ప్రత్యర్థి పక్షాలకు ఆయుధంగా ఉపయోగపడుతున్నాయి. ఆ ఎపిసోడ్ చల్లారిపోతోందని అనుకునేలోపు.. బుచ్చయ్య ఎపిసోడ్ ఓపెన్ గా టాపిక్ అయిపోయింది. పార్టీలో సీనియర్ల మాటకు, అభిప్రాయాలకు విలువ లేదని ప్రజలు సైతం భావించే స్థితికి తీసుకువస్తోంది. దీనికి అంతటికీ కారణం.. చిన బాబే అన్న అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది.ఎందుకంటే.. 2014లో.. ఎన్నికలకు వెళ్లినప్పుడు చంద్రబాబు కుడి, ఎడమ భుజాలుగా సీఎం రమేశ్, సుజనా చౌదరి వ్యవహరించారు. టికెట్ల కేటాయింపు నుంచి మొదలు పెట్టి చంద్రబాబు పాలసీలను ప్రజల్లోకి తీసుకెళ్లేవరకూ ప్రతీ విషయంలోనూ భాగం పంచుకున్నారు. తర్వాత.. టీడీపీ గెలిచింది. పాలనలో బాబు బిజీ అయ్యారు. మెల్లమెల్లగా కార్యకర్తలకు దూరమయ్యారు. ఇదే వేళ.. లోకేశ్ పరపతి పార్టీలో పెంచేలా కార్యాచరణ ప్రారంభమైంది. ప్రతి నిర్ణయంలో చినబాబు నిర్ణయాలకు ప్రాధాన్యత పెరగడం కొనసాగింది. కాలక్రమంలో.. కారణాలేవైనా సరే. సుజనా, రమేశ్ లాంటి నేతలు పార్టీని వీడి.. బీజేపీలో చేరిపోయారు. బాబు పాలసీని ఇంప్లిమెంట్ చేసేవాళ్లు తగ్గిపోయారు.అలాగే.. 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం.. మంగళగిరిలో లోకేశ్ ఓటమి సైతం.. టీడీపీని కుంగదీశాయి. ఆ తర్వాత.. పార్టీని సీనియర్ నాయకులు వీడడం.. తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తూ రావడం.. ఇలాంటి తరుణంలోనూ లోకేశ్ కే ప్రాధాన్యత కొనసాగుతుండడం వంటి పరిణామాలు.. పార్టీని ఇక్కడివరకూ తీసుకువచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎంతగా వైసీపీపై వ్యతిరేకంగా ప్రచారం చేసినా.. చివరికి మెజారిటీ స్థానాలు అధికార పార్టీకే దక్కడం.. టీడీపీని మరింత కుంగదీసింది. ఇలాంటి తరుణంలోనే.. సీనియర్ల మాటలను పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదని.. అందుకే.. ఇలాంటి పరిస్థితి టీడీపీకి దాపురించిందనీ.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేస్తున్న విమర్శలు.. జనాల్లోకి ఓ అభిప్రాయాన్ని తీసుకువెళ్తున్నాయి.లోకేశ్ కు ప్రాధాన్యత ఇచ్చినా సరే.. గతంలో మాదిరిగా చంద్రబాబు నేరుగా పార్టీని పట్టించుకోవాలని.. సీనియర్ల మాటలకు.. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలకు విలువ ఇస్తూనే.. లోకేశ్ ను నాయకుడిగా ఎదిగేలా చేయాలని.. అలా చేస్తేనే.. రాబోయే ఎన్నికల్లో పార్టీ కాస్త బలపడి.. రాజకీయాల్లో నిలదొక్కుకోగలదని.. అంచనాలు వ్యక్తవుతున్నాయి. గోరంట్ల ఎపిసోడ్ ద్వారా.. టీడీపీలో ఉన్న స్పష్టమైన వాతావరణం బయటపడిందని.. ఇప్పటికైనా బాబు కాస్త రూట్ మార్చి గేర్ పెంచాలని.. ఆ పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ నుంచి ఓ మెసేజ్ పాస్ అవుతోంది.

Related Posts