నెల్లూరు
ఎపి మంత్రి అళ్ల నాని కాన్వాయ్ లో వాడే విఐపి వెహికల్ యాక్సిడెంట్ కు గురయింది. అందులో ప్రయాణిస్తున్న ఆయన బంధువులు ఇద్దరు చనిపోయినట్టు సమాచారం. నెల్లూరు జిల్లా మర్రిపాడులో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మర్రిపాడు మండలం ఏపీలగుంటలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి. దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు కృష్ణా జిల్లా ఏలూరు వాసులుగా పోలీసులు గుర్తించారు.