YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

సరస్వతీ నిలయంలో శోభనం

సరస్వతీ నిలయంలో శోభనం

కాకినాడ
సరస్వతీ నిలయం శోభనానికి వేదికయింది. కాకినాడ జేఎన్టీయూకే హనీమూన్ హబ్ గా మారింది.  జేఎన్టీయూకే గెస్టు హౌజ్ లో శోభనం తతంగం తాజాగా వెలుగులోకి   వచ్చింది. 3.నూతన వధూవరులకు గెస్టు హౌజ్  శోభనం గదిగా మారడంతో విమర్శిలు వెల్లువెత్తాయి. యూనివర్సిటీ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా శోభన కార్యక్రమం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫిసర్ .స్వర్ణకుమారి పేరు మీద  రూమ్ లు బుక్ చేసారు. చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువైయున్న జెఎన్.టి.యు.కె కాకినాడ గెస్ట్ హౌస్ ఓ ప్రొఫెసర్ నిర్వాకం వలన అపవిత్రం అయిందని విమర్శలు వస్తున్నాయి. నూతన వధూవరులకు తొలి రాత్రి అనుభవానికి యూనివర్సిటీ గెస్ట్ హౌస్ వేదికయ్యింది. ఈ నెల 18వ. తేదీన ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ..స్వర్ణ కుమారి పేరిట జె.ఎన్.టి.యు.కె కు చెందిన గెస్ట్ హౌస్ లో మూడు రూములు బుకింగ్ జరిగింది. బుక్ చేసిన రూమ్ నెంబర్ 201లో శోభనం ఏర్పాట్లు అట్టహాసంగా ఏర్పాటు చేసారు.   18వ  తేదీ రాత్రి బంధుమిత్ర సపరివారంగా మొదటి రాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. .సరస్వతీ దేవి కొలువైయున్న యూనివర్సిటీని అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించడం పట్ల పలు ఉద్యోగ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

Related Posts