రంగారెడ్డి
పరిటాల రవి కుమారుడు పరిటాల సిద్దార్ద్ చుట్టు ఉచ్చు బిగిస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోట్ లో బుల్లెట్ తో సిద్దార్ద్ పట్టుబడ్డ విషయం తెలిసిందే. దాంతో పోలీసులు అయనను వివరణ ఇవ్వాలని నోటీస్ ఇచ్చారు. సిద్ధార్థ్ లైసెన్స్ డ్ గన్ కు బ్యాగులో దొరికిన బులెట్ కు వ్యత్యాసం వుండడంతో పోలీసులు నోటీసులుజారీ చేసారు. గతంలో పాయింట్ 32 క్యాలిబర్ గన్ కు అయన లైసెన్స్ పొందారు. అయితే, బుధవారం ఎయిర్ పోట్ లో సిద్ధార్థ్ బ్యాగులో 5.56 క్యాలిబర్ బుల్లెట్ లభ్యం అయింది. సిద్ధార్థ్ వద్ద సాయుధ బలగాలు వాడే ఇన్సాస్ రైఫిల్స్ బుల్లెట్ వుందని గుర్తించారు. ఈ బుల్లెట్ సిద్ధార్థ్ కు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై విచారణ చేస్తున్నారు. అనంతపూర్ కు చెందిన ఇండో టిబెటెన్ బోర్డర్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ తూటాగా అనుమానిస్తున్నారు. కానిస్టేబుల్ తో పరిటాల కుటుంబానికి పరిచయాలు ఉన్నట్లు సమాచారం.