YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు ఖాయం

హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు ఖాయం

హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు ఖాయం
యాదాద్రి భువనగిరి
జన ఆశీర్వాద యాత్ర లో భాగంగా నేడు భువనగిరి పట్టణానికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రైవేట్ హోటల్ లో మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గా గా జమ్మూకాశ్మీర్ లో 370 కి వ్యతిరేకంగా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టాం..దాన్ని రద్దు చేసుకొని, భారత రాజ్యాంగం పరిధిలోకి తీసుకురావటం కీలక ఘట్టం..నా జీవితం లో ఇది కీలక నిర్ణయం. నా మీద నమ్మకంతో క్యాబినెట్ మంత్రి గా నాకు మోడీ అవకాశం కల్పించారు. పర్యాటక, సంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ ని తనకు కేటాయించారు. నేను ఈ ఛాలెంజ్ ని స్వీకరించాను. ఈశాన్య రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో 67 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందు కు కృషి చేస్తున్నాం. ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చేసేలా ప్రోత్సాహిస్తున్నాము. ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న హాండీక్రాఫ్ట్స్ ప్రపంచ దేశాలలో మార్కెటింగ్ చేసే లక్ష్యంతో ముందుకు పోతామని అన్నారు. కోవిడ్ కారణంగా  దేశానికి పర్యాటకులు విదేశాల నుంచి రాలేదు. జిడిపి 5 శాతం మాత్రమే పర్యాటకం నుంచి ఉంటుంది. మన దేశంలో పర్యాటక రంగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. జనవరి నుంచి మళ్ళీ పర్యాటకం ప్రారంభిస్తాము. మన దేశంలో అద్భుతమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో న్యూజిలాండ్ లాంటి సుందర ప్రదేశాలు ఉన్నాయి. మనదేశంలో ప్రతి కుటుంబం 15 పర్యాటక కేంద్రాలను సందర్శించే వీలుగా  ప్రణాళికలు చూస్తున్నాం. డిసెంబర్ లోపు కరోనా lవ్యాక్సినేషన్ చాలా వరకు పూర్తి అవుతుంది. మన రాష్ట్రం లో ప్రజల బోనాలు పండగలు ,బతుకమ్మ,  గిరిజన పండగలు సమ్మక్క సారక్క జాతరాలు జరుగుతున్నా యి. ఇదేవిధంగా పత్తి రాష్ట్రంలో ఉన్న సంప్రదాయ పండుగలను గుర్తించి దేశంలో సంస్కృతి శాఖ ద్వారా దేశం మొత్తం  జరిగే విధంగా  చేస్తాం. 40 యునెస్కో గుర్తింపు పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. వాటిని మౌలిక వసతులు కల్పించనున్నాం. ఆర్కియాలజీ కట్టడాలను వాటన్నిటినీ భద్రపరిచి భావితరాలకు తెలిసేలా కృషి చేస్తాం. దేశంలో 3700 ల మాన్యుమెంట్స్ ఉన్నాయని అయన అన్నారు. భువనగిరి కోటకు ప్రత్యేక ఉంది. రోప్ వే ద్వారా అభివృద్ధి చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తో మాట్లాడి అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. హుజురాబాద్ లాంటి ఎన్నికలు గతం లో ఎక్కడా చూడలేదు. కుటుంబ రాజకీయాలు చేసేవారిని తెలంగాణ ప్రజలు తిప్పికొడుతారు. హుజురాబాద్ లో బిజెపి గెలుపు ఖాయమని అయన అన్నారు.

Related Posts