అంబర్ పేట వాసులకు ధన్యవాదాలు
హైదరాబాద్, ఆగస్టు 21,
“తల్లి వద్దకు చాలా రోజుల తర్వాత బిడ్డ వస్తే ఎంత సంతోష పడతారో.. నేను అంబర్ పేటకు వచ్చినప్పుడు కూడా అంతే సంతోషంగా అనిపిస్తుంది” అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. “నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అంబర్ పేట ప్రజలే కారణం.. ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న నాకు అంబర్‌పేట ప్రజలు ఇచ్చిన దీవెనలతో ఈ స్థాయికి ఎదిగాను. నాకు శ్వాస ఉన్నంత వరకు మరచిపోను. అని కిషన్ రెడ్డి అన్నారు.జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ మధ్యాహ్నం హైదరాబాద్ అంబర్‌పేట నియోజక వర్గంలో పర్యటిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. “కేంద్రమంత్రి అయినా సంతోషంగా లేదు.. అంబర్పేట ప్రజలకు దూరమైనాననే బాధనే ఎక్కువగా ఉంది.” అని కేంద్రమంత్రి తన మనసులో మాట బయటపెట్టారు.దేశానికి సేవ చేసే అవకాశాన్ని అంబర్ పేట, సికింద్రాబాద్ ప్రజలు, నరేంద్ర మోడీ ఇచ్చారు. నేను సహాయ మంత్రిగా పని చేస్తే.. కేంద్ర కేబినెట్ హోదా మంత్రిగా పదవి ఇచ్చి ఐదుగురు సహాయ మంత్రులను నాకు ఇచ్చారు ప్రధాని మోదీ.” అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.