వర్శిటి గెస్ట హౌస్ లో శోభనం
కాకినాడ, ఆగస్టు 21,
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ వర్శిటీ సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. జేఎన్టీయూ గెస్ట్‌హౌస్‌లో ఏకంగా శోభనం జరిపించడం కలకలంరేపింది. ఓ గదిలో నూతన వధువరులకు శోభనం తంతు నిర్వహించారట. ఈ నెల 18 న యూనివర్శిటీకి చెందిన మహిళ సాధికారత డైరెక్టర్ పేరు మీద 201 రూమ్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. సరస్వతి నిలయంగా చెప్పుకునే విద్యాలయంలో ఇలాంటి చర్యలపై యూనివర్సిటీ విద్యార్ధులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై వర్శిటీ సిబ్బంది స్పందించాల్సి ఉంది. వెంటనే ఈ ఘటనపై స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.సాధారణంగా ఇతర ప్రాంతాల నుంచి యూనివర్సిటీ వ్వవహారాల నిమిత్తం ఇక్కడికి వచ్చే అధికారులు,సిబ్బందికి ఈ గదులను అద్దెకు ఇస్తుంటారు. ప్రైవేట్ కార్యకలాపాలకు ఇవ్వకూడదు.. విద్యార్థులు చదువుకునే యూనివర్సిటీలో ఇలాంటి ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై యూనివర్సిటీ అధికారుల్నివివరణ కోరగా.. దీనిపై ఒక కమిటీ వేసి విచారణకు ఆదేశిస్తామన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.