YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దళిత బంధు తురుపు ముక్క

దళిత బంధు తురుపు ముక్క

దళిత బంధు తురుపు ముక్క
హైదరాబాద్, ఆగస్టు 23, 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి వ్యూహకర్త. మాటకారి. ఆయన తన మాటలతోనే తెలంగాణ తెచ్చారు. అలాగే కొత్త రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఏదైనా ఉప ఎన్నికలు వస్తే తప్ప ఆయన వరాలు ప్రకటించరు. ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకం మిగిలిన నియోజకవర్గాల్లో కాక రేపుతుంది. దళిత కుటుంబానికి ఒక్కొక్కరికి పది లక్షలు ఇచ్చే పథకం పై మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఆశలు పెరిగాయి.అంటే వచ్చే ఎన్నికల వరకూ ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఈ పథకం కేసీఆర్ కు తురుపుముక్క అనే చెప్పాలి. మరోసారి విజయానికి ఈ పథకం ఉపయోగపడే వీలుందన్న అంచనాలు ఉన్నాయి. తొలుత హుజూరాబాద్ నియోజకవర్గంలో దీనిని అమలు చేయనున్నారు. ఇక్కడ ఈ పథకం వర్క్ అవుట్ అయి టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధిస్తే భవిష్యత్ లో దీనిని మిగిలిన నియోజకవర్గాలకు విస్తరిస్తారు. అలాగా కాకుండా ఓటమి పాలయితే మిగిలిన నియోజకవర్గాల్లో అమలుకు కొంత సమయం పడుతుందిదళిత ఓటు బ్యాంకును గంపగుత్తగా తన పరం చేసుకునేందుకే కేసీఆర్ ఈ పథకాన్ని తెచ్చారన్నది వాస్తవం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితికి ఈ పథకం గుదిబండగా మారనుందని ఉన్నతస్థాయి అధికారులు సయితం అభిప్రాయపడుతున్నారు. అయినా కేసీఆర్ లెక్క చేయడం లేదు. ఈ పథకం కోసం అవసరమైతే లక్ష కోట్ల రూపాయలను సమీకరించి వెచ్చిస్తానని ఆయన పదే పదే చెబుతున్నారు.
ఈ పథకం అమలు కోసం హైదరాబాద్ లో ఉన్న స్థలాలు మాత్రమే కాకుండా జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను కూడా వేలానికి పెట్టే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దళిత బంధుతో పాటు కేసీఆర్ చేనేత బంధు కూడా ప్రకటించనున్నారు. దీంతో రాష్ట్ర ఖజానా నుంచి ఈ పథకాలకే ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఈ పధకాల అమలు సజావుగా జరిగితే రాజకీయంగా కేసీఆర్ కు ఇక తిరుగులేనట్లే. విపక్షాలకు మరోసారి విజయాన్ని దూరం చేసినట్లే అనుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధిని మాత్రం అడక్కండి.

Related Posts