YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అముల్, మదర్ డైరీ పాలు పూర్

అముల్, మదర్ డైరీ పాలు పూర్

పాలను బలవర్ధకమైన ఆహారంగా పిల్లలకు అందిస్తారు. మన దేశంలో పాల ఉత్పత్తే కాదు.. వినియోగం కూడా చాలా ఎక్కువే. అందుకే దేశవ్యాప్తంగా అనేక డైరీలు పుట్టుకొచ్చాయి. దేశంలోని ప్రతి రాష్ట్రానికి సహకార పాల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. వీటికి తోడు పలు ప్రవేటు డైరీలు కూడా పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి.అమూల్, మదర్ డైరీ సహా 21 డైరీలకు చెందిన పాల నమూనాలు నాసిరకంగా ఉన్నాయని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్  వెల్లడించారు. ఈ 20 పాల నమూనాలు ఆరోగ్యానికి ప్రమాదకరం కాదు కానీ, ప్రమాణాలను పాటించడం లేదని చెప్పారు. కొవ్వు వంటి ఇతర కాంపోనెంట్స్ విషయంలో సూచించిన స్థాయిలను ఈ డైరీలు పాటించడంలేదని వివరించారు. పరీక్షల నిమిత్తం ఏప్రిల్ 13 నుంచి 28 వరకు ఢిల్లీ వ్యాప్తంగా 165 పాల నమూనాలను సేకరించామని చెప్పారు. వీటిలో 21 నమూనాలు అప్రామాణికంగా తేలినట్లు చెప్పారు.పాల వినియోగం విపరీతంగా పెరగడంతో డైరీ సంస్థలు నాణ్యతకు పాతర వేస్తున్నాయి. గుజరాత్ సహకార డైరీ అమూల్, నొయిడా కేంద్రంగా పాల ఉత్పత్తులను విక్రయిస్తోన్న మదర్ డైరీ వంటి పెద్ద సంస్థలు కూడా ప్రామాణికాలకు పాతర వేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన పరీక్షల్లో తేలింది.ఈ నమూనాల నివేదికను కోర్టుకు పంపిస్తామని, నిబంధనలను పాటించని డైరీలకు రూ.5 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. మరి ఢిల్లీ ప్రభుత్వ నివేదికపై ఆయా డైరీలు ఏ విధమైన వివరణ ఇస్తాయో చూడాలి.

Related Posts