YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

నిరుపయోగంగా సైక్లింగ్ ట్రాక్

నిరుపయోగంగా సైక్లింగ్ ట్రాక్

నిరుపయోగంగా సైక్లింగ్ ట్రాక్
హైద్రాబాద్, ఆగస్టు 23,
నానాటికి కాంక్రీట్ జంగిల్ గా మారిపోతున్న నగరంలో.. పచ్చదనం కనుచూపు మేరలో కనిపించదు. నిత్యం ట్రాఫిక్ రణగొణధ్వనులు, కాలుష్యం, గాలిలో కనిపించే దుమ్ము, ధూళితో నగరవాసులు రోగాల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నగరవాసులకు పచ్చని చెట్లతో పాటు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు పాలపిట్ట పార్కును ఏర్పాటు చేశారు. కానీ పార్కును ఏర్పాటు చేసిన మూడేళ్లకే సందర్శకులు లేక మూగబోయింది. తొలినాళ్లలో వందలాది జనాలతో కిటకిటలాడిన పాలపిట్ట పార్కు నేడు నిరాదరణకు గురవుతోంది. దీంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన పార్కు కళ తప్పుతోంది.నగర వాసులకు చిట్టడవిలో తిరుగుతున్న ఫీల్ కలిగించేలా భారీ వ్యయంతో గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్ కు సమీపంలో కొండాపూర్ దగ్గరలో పాలపిట్ట పార్కును 2017లో అటవీ శాఖ ప్రారంభించింది. చెట్లకు హాని కలుగకుండా ప్రకృతి ఒడిలో సైక్లింగ్ చేస్తూ సేదతీరేలా పార్కును తీర్చిదిద్దారు. దాదాపు 40 ఎకరాల్లఉండగా, 3 కిలోమీటర్ల పొడువు సైక్లింగ్ ట్రాక్ తో పాటు 500 సైకిళ్లను అందుబాటులో ఉంచారు.వాస్తవానికి కోర్ సిటీ కంటే ఐటీ కారిడార్ లో నివాసం ఉండే వారికి ఈ పార్కు ఎంతో అనుకూలంగా ఉంటుంది. బిజీబిజీగా గడిపే ఐటీ ఉద్యోగులు వీకెండ్ లోనైనా ఫ్యామిలీతో కలిసి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో కోట్లు ఖర్చు చేసి నిర్మించిన పార్కు నిరుపయోగంగా మారింది. తొలినాళ్లలో వీకెండ్ లో ఉదయం, సాయంత్ర పూట వెయ్యి కి పైగా సందర్శకులు వచ్చేవారు. కానీ, ప్రస్తుతం 300 మించడం లేదు.సందర్శకులను పెంచేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నా.. విజిటర్ల ఆదరణను పొందడం లేదు. ముఖ్యంగా పార్కు ప్రాంగణంలో ఫ్యామిలీతో కలిసి సైక్లింగ్ చేసేలా విశాలమైన ఆట స్థలంతో పాటు తక్కువ ధరలోనే రుసుం తీసుకుంటున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు.ఒక్కో సైకిల్ ను పది వేల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేశారు. మొత్తం 500 సైకిళ్లు ఉండగా ఇందులో 80 సైకిళ్లు చిన్న పిల్లల కోసం ఉన్నవి. వీటిలో సగానికి పైనే నిరుపయోగంగా మారాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు  ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అదే విధంగా సాయంత్రం 4  నుంచి 7 గంటల వరకు వినియోగించేలా ఉంది. వీకెండ్ లో మాత్రం ఉదయం 6 నుంచి 11.30 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 7 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. గంటకు రూ. 50, చిన్న పిల్లలకు  రూ. 25 ఛార్జీలు చేస్తుండగా, నెలవారీ పాస్ పై రూ.800 గా ఉంది. ప్రస్తుతం మంత్లీ పాస్ కలిగిన వారి సంఖ్య గత రెండేళ్లలో 700లకు దాటలేదు. అయితే సైకిల్ రెంటు భారీగా ఉండటం ఒక కారణమైతే, కోర్ సిటీకి కాస్తా దూరంగా ఉండటమే ఆదరణ లేదని, దీంతో పాటు కేవలం సైక్లింగ్ ట్రాక్ లే కాకుండా ఇతర యాక్టివిటీ ఉండేలా పార్కు నిర్వాహకులు చర్యలు తీసుకుంటే  సందర్శకుల తాకిడి పెరుగుతుందనీ స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Related Posts