తెల్లవారుజామున సైకో కలకలం
నల్లగొండ
నల్లగొండ టౌన్ లో కొద్ది రోజులుగా సైకో కలకలం రేపుతున్నాడు. తెల్లవారుజామున ఇళ్ల ముందు కల్లాపు చల్లుతున్న మహిళల పట్ల అసభ్య ప్రవర్తనతో రెచ్చిపోతున్నాడు. ఉదయం -ముగ్గులేస్తున్న మహిళల వద్దకు.. బట్టలిప్పుకుని వెళ్తున్నాడు. ఈ విషయం ఎవరికి చెప్పుకోలేక మహిళలు నరకయాతన అనుభవిస్తున్నారు. బ్లాక్ యూనికాన్ బైక్, మంకీ క్యాప్, షార్ట్, షూ వేసుకుని ఆ వ్యక్తి తిరుగుతున్నాడు. టు టౌన్ లిమిట్స్ లో.. శ్రీనగర్ కాలనీ, రాక్ హిల్స్, వీటి కాలనీలలో ఆ వ్యక్తి ప్రతి రోజు సంచరిస్తున్నాడు. కాలనీల మహిళలు భయాందోళనలో వున్నారు.