రోగి మృతి...తెరాస అందోళన
పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లాలో వలస కార్మికుని మృతి విమర్శలకు తావిస్తోంది... వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కార్మికుడు మృతి చెందాడంటు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి...ఆలస్యంగా వెలుగులోకి వెచ్చిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చర్చకు తెరలేపింది.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి వద్ద ఈనేల 12 వ తేదీన సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో ఉత్తరకాండ్ నుండి కర్నూల్ జిల్లా నంద్యాలకు 18 మంది కూలీలు వెల్తుండగా అతుల్ దలి అనే కూలి కిందపడి తీవ్ర గాయాలపాలైనాడు. 108 లో ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా... వైద్యానికి సహకరించడంలేదని తాళ్లతో ఆసుపత్రి సిబ్బంది బెడ్ కు కట్టివేయడంతో మరణించాడు. చికిత్స చేయాల్సిన వైద్యులు క్షతగాత్రున్నీ తాళ్లతో కట్టేయడంతో మృతిచెందడాని ప్రభుత్వ ఆసుపత్రి ముందు టిఆర్ఎస్ నాయకులు దర్నాకు దిగారు. ఆసుపత్రి డాక్టర్, సూపరిండెంట్ పర్యవేక్షణ లేకపోవడంతో అతను మరణించాడంటూ ప్రభుత్వ ఆసుపత్రి ముందు టిఆర్ఎస్ నాయకుడు బెక్కంప్రశాంత్ దర్నాకు దిగాడు.ఆసుపత్రి పర్యవేక్షనకు వచ్చిన రాష్ట్ర వైద్య విధాన పరిషత్ అధికారి డా. సూర్యశ్రీ రావు కు సూపరింటెండెంట్, డ్యూటీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు