YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అగ్రిగోల్డ్ బాధితుల మృతికి చంద్రబాబే కారణం

అగ్రిగోల్డ్ బాధితుల మృతికి చంద్రబాబే కారణం

అగ్రిగోల్డ్ బాధితుల మృతికి చంద్రబాబే కారణం
విశాఖపట్నం
అగ్రి గోల్డ్ బాదితుల 300మంది మరణానికి అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడే ప్రధాన కారణం అని రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కెకె రాజు ఘాటు విమర్శలు చేశారు.    విశాఖ ఉత్తర నియోజక వర్గం వైసిపీ కార్యాలయం లో   ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  అగ్రి గోల్డ్ బాదితుల కు తీవ్ర అన్యాయం చేసింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే అంటూ దుయ్యబట్టారు. సుజనా చౌదరి, లోకేష్, మురళీ మోహన్ కోటరీగా ఏర్పడి అమరావతిలో అగ్రి గోల్డ్ ఆస్తులు దోచేయడానికే ప్లాన్ చేశారని  ఆరోపించారు.
 ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాదితుల కు దశల వారీగా న్యాయం చేస్తున్నామన్నారు.  ఇప్పటి కే పది వేల లోపు డిపాజిట్ చేసిన  3 లక్షల 40 వేల మందికి 240 కోట్లు రూపాయలు  నగదు జమ చేయడం జరిగింది అని, ఈ విడతలో ఇరవై వేలు లోపు డిపాజిట్ చేసిన వారికి నగదు అందజేస్తున్నట్లు తెలిపారు. అగ్రి గోల్డ్ బాదితుల కు బడ్జెట్ లో 1150కోట్లు కేటాయించడం జరిగింది అన్నారు. అగ్రి గోల్డ్ సంస్థ భూములు లో టిడ్కో గృహాలు నిర్మాణం చేసి అర్హులైన బాదితుల కు అందజేయనున్నట్లు తెలిపారు.  ఈ మీడియా   సమావేశంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్  బాణాల శ్రీను, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్ రావు,  కార్పొరేటర్ అనీల్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Posts