ఇంద్రకీలాద్రిలో ముగిసిన పవిత్రోత్సవాలు
విజయవాడ
ఇంద్రకీలాద్రి వెలసిన కనకదుర్గమ్మ గుడిలో పవిత్రోత్సవాలు ముగిశాయి. మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరిగా యి.నేడు పూర్ణాహుతి కార్యక్రమంలో ఈవో భ్రమరాంబ, ఛైర్మన్ పైలా సోమినాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గగుడి స్థానాచార్యులు వి.శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయతీ అని తెలిపారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పూజా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. కరోనా నుండి ప్రజలను కాపాడి చల్లగా చూడాలని వేడుకున్నామని శివప్రసాద్ శర్మ అన్నారు.మహా పూర్ణాహుతి కార్యక్రమముతో పవిత్రోత్సవములు దిగ్విజయంగా పరిసమాప్త మయ్యా యని , ఆఖరి రోజున శాంతిక పౌష్టిక హోమము, మహా పూర్ణాహుతి, కలశో ద్వాసన, మార్జన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.