YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అవాస్తవాలు మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి - మంత్రి హరీశ్ రావు

అవాస్తవాలు మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి - మంత్రి హరీశ్ రావు

అవాస్తవాలు మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్
కేంద్రం విడుదల చేసిన గణాంకాల ఆధారంగా ఆర్థిక శాఖ లెక్కలు చూపిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు.   కేంద్రంమంత్రి కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్ర పేరుతో అవాస్తవాలు మాట్లాడుతున్నారు.  టీపీసీసీ అధ్యక్షుడు ప్రజలను మోసం చేసే విదంగా అబద్ధాలు చెప్తున్నారు.  దేశంలో ఒక్క గ్రోత్ తో తెలంగాణ గ్రోత్ పోల్చితే రాష్ట్రంది డబుల్ అయిందని మంత్రి వెల్లడించారు.
దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో- మొత్తం దేశంలో మూడో స్థానంలో ఉన్నాము.  2014 లో తెలంగాణ జిడిపి 4.06శాతం ఉంటే- 2021కి వచ్చే సరికి 4.97శాతం కు పెరిగింది.  దేశానికి ఇచ్చే జీడీపీలో తెలంగాణ రాష్ట్రం 6వ అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నాము.  దేశం వృద్ధి రేటుతో తెలంగాణ పోల్చితే పెరుగుతూ పోతుంది.  తెలంగాణ రాష్ట్రం ఆరు ఏళ్లుగా 11.7 వృద్ధి రేటు ఉంటే. దేశం 8.7 మాత్రమే ఉందని అన్నారు.
భారతదేశ ఆర్థిక పరిస్థితి బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఉంది. మోడీ సాధించిన ఘనత బంగ్లాదేశ్ కంటే ఆర్థిక పరిస్థితిని దిగజార్చడం.  దేశాన్ని గొప్పగా బీజేపీ నడిపితే వృద్ధిలో బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఎందుకు ఉంది? గడిచిన ఆరేళ్ల వృద్ధి రేటుతో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉంది.   పర్కాపిటి ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానంలో ఉన్నాము- రాష్ట్రం ఏర్పడినప్పుడు 7వ స్థానంలో ఉన్నాము.  దేశం పర్కాపిటి ఇన్కమ్ ఆరేళ్లలో 48 శాతం ఉంటే- తెలంగాణ రాష్ట్రంది 91.5శాతంగా ఉంది.  తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రం సంపద పెరిగింది- ప్రజల ఇన్కమ్ కూడా పెరిగింది.
జీబీపీ తలసరి ఆదాయం లో దేశంతో పోల్చితే తెలంగాణ వరుసగా ప్రతి ఏటా అన్ని రంగాల్లో పెరుగుతూ వెళ్తోంది.  గడిచిన ఆరేళ్లలో పర్కాపిటి ఇన్కమ్ దేశంలో 7శాతం ఉంటే- తెలంగాణ రాష్ట్రానిది 11.5 శాతంగా ఉన్నాము.  వ్యవసాయ రంగం తెలంగాణ వృద్ధికి చాలా ఉపయోగపడింది. కరొనా సమయంలో కూడా తెలంగాణ వృద్ధి ఆగలేదు- దేశం వృద్ధి చాలా డిలా పడింది.  సౌత్ ఇండియా లో ఝీఎసడీపీ – తలసరి ఆదాయం  లో తెలంగాణ నెంబర్ వన్ గా గడిచిన ఆరేళ్లుగా ఉన్నాము.  2014 నుంచి 2021 వరకు రెవెన్యూ కలెక్షన్స్ లో 90శాతం సక్సెస్ అయ్యామని అన్నారు.
రాష్ట్ర సొంత రెవెన్యూ లెక్కల్లో దేశంలోనే ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో ఉంది.  ప్రాజెక్టులు- గొర్రెల పంపిణీ వల్ల రాష్ట్ర ఉత్పత్తికి ఎంతో తోడ్పడింది.  టాక్స్ కలెక్షన్స్ లో 11.52 శాతంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది- గుజరాత్ చివరి స్థానంలో ఉంది.  వ్యవసాయ రంగంలో దేశంతో పోల్చితే తెలంగాణ రాష్ట్రం వృద్ధిరేటు నాగున్నార రేట్లు ఎక్కువగా ఉంది.  గొర్రెలు- బర్రెలు- చేపలు పంచితే ఎమ్ వస్తుంది అంటే ప్రజల ఆదాయం పెరిగిందని కేంద్రం లెక్కలు సమాధానం చెప్తున్నాయి.  రాష్ట్రం ఏర్పడినప్పుడు వరి ధాన్యం ఉత్పత్తి లో 9వేల కోట్లు ఉంటే- ప్రస్తుతం 47వేల కోట్లకు పెరిగింది.  ఇండస్ట్రీ లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రస్తుతానికి 72శాతం గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంది.  30లక్షల వ్యవసాయ విద్యుత కలెక్షన్స్ ఉన్నాయి- అందరికి ఉచితంగా విద్యుత్ రైతులకు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అయన అన్నారు.

Related Posts