YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బళ్లారి కింగ్ చేతిలో 15 మంది జాతకాలు

బళ్లారి కింగ్ చేతిలో  15 మంది జాతకాలు

మైనింగ్ మ‌హారాజుగా వెలుగొంది.. అవినీతికి పాల్ప‌డి జైలు ఊచ‌ల‌ను లెక్క‌బెట్టిన బ‌ళ్లారి కింగ్‌.. గాలి జ‌నార్ద‌న‌రెడ్డి.. ఇప్పుడు బీజేపీ పాలిట క‌ల్ప‌వృక్షం! ఆయ‌న చేతిలో అచ్చంగా 15 మంది బీజేపీ అభ్య‌ర్థుల జాత‌కాలు ఉన్నాయి. గాలి క‌ను సైగ ఉంటేనే ఇప్పుడీ 15 మంది గెలుపు సాధ్య‌మ‌య్యేది. అందుకే గాలిపై ఎన్ని దుమారాలున్నా.. బీజేపీకి ఇప్పుడు ఆయ‌న ఆత్మీయుడు. నిజానికి గాలి జనార్దనరెడ్డికి- మా పార్టీకి ఏ విధమైన సంబంధమూ లేదన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. వ్యాఖ్య‌ల‌ను తోసిపుచ్చుతూ.. మూడు వారాల్లోపే జనార్దనరెడ్డి పార్టీ కార్యకలాపాల్లో కీల‌కంగా మారారు. బళ్లారి జిల్లాలోకి వెళ్లేందుకు అవ‌కాశం లేక పోయినా.. సరిహద్దులోని హానగల్‌ గ్రామంలో తిష్ట‌వేసిన గాలి… సొంత జిల్లా వ్యవహారాల్ని చక్కబెడుతున్నారు. రాయచూరు, బళ్లారి జిల్లాల్లో కనీసం పది, ప‌దిహేను నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గాలి కృషి వల్లే గెలుస్తార‌న‌డంలో సందేహం లేదు.త‌న సోద‌రుడు గాలి సోమ‌శేఖ‌ర‌రెడ్డి స‌హా త‌న ఆత్మీయుల‌కు కూడా గాలి టికెట్లు ఇప్పించుకున్నారు. చిత్రదుర్గ జిల్లా మొలకాల్మూరు భాజపా అభ్యర్థి శ్రీరాములు గెలుపునకు ఆయన ఆత్మీయుడు గాలి జనార్దనరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఏకంగా.. శ్రీరాములు అభ్యర్థిత్వాన్ని అడ్డుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే.. తిప్పేస్వామి అనుయాయుల్ని ఆకర్షించి- ఆయనను రాజకీయంగా బలహీనుణ్ని చేసేందుకు గాలి ప‌థ‌కం అమ‌లు చేస్తున్నారు. మళ్లీ `ఆపరేషన్‌ కమల`కు శ్రీకారం చుట్టారు. ఇలా తెర వెనుకే కాకుండా బహిరంగంగానూ గాలి బరిలోకి దిగారు. శ్రీరాములు బాదామి నుంచి సీఎం సిద్ధరామయ్యను ఎదుర్కోవాల్సి ఉన్నందున మొలకాల్మూరు బాధ్యతల్ని తన భుజాలపైనే వేసుకున్నారు.తనను గ‌తంలో ఇబ్బందులు పెట్టిన వారికి ఈ ఎన్నిక ద్వారా తగిన గుణపాఠాన్ని చెప్పాలని భావించిన జనార్దనరెడ్డి మొలకాల్మూరులోనే చ‌క్రం తిప్పారు. అయితే.. పైకి గాలి తో సంబంధం లేద‌ని, త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని భావించిన పార్టీ అధిష్టానం సైతం ఇప్పుడు గాలి వ‌ల్ల దాదాపు 15 మంది జాత‌కాలు ప్ర‌భావిత‌మ‌వుతాయ‌ని గుర్తించ‌డంతోఆయ‌న‌పై ఉన్న కేసులను కూడా ఎత్తి వేసేందుకు తెర‌చాటు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని స‌మాచారం. 

Related Posts