పెట్రోల్ దాడి బాధితురాలిని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్
విశాఖపట్నం
పెట్రోల్ దాడి బాధితురాలిని కేజీహెచ్ లో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సోమవారం పరామర్శించారు. విజయనగరం జిల్లా చౌడువాడలో పెట్రోల్ దాడిలో బాధితురాలు గాయపడిన విషయం తెలిసిందే. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మహిళలు రాష్ట్రంలో అర్ధబాగం. 26 నెలల జగన్ పరిపాలనలో మహిళా సంక్షేమాని పెద్దపీట వేశారు. బాలికలు దగ్గర నుండి పండు ముసలి వరకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. పురష ఆధిపత్యం ఉండే రాజకీయం రంగంలో కూడా మహిళలు కూడా సమానం అని ముఖ్యమంత్రి నిరూపిస్తున్నారు. మహిళా సాధికారత కోసం మహిళా కమీషన్ రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తుంది. మహిళా ఉద్యోగుల వేధింపులపై మహిళా కమీషన్ దృష్టి సారించింది. అంతర్గత ఫిర్యాదుల కమిటీలు వేస్తున్నాము. ప్రతిపక్షాలు విమర్శలు ఆపాలి. గత ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం జరిగినా స్పందించని చంద్రబాబు, ఇప్పుడు విమర్శలు చేయడం సమంజసం కాదు. టెక్నాలజి, సామాజిక మాద్యమాలు వలన ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు.