స్వామి సన్నిధిలో శ్రావణ మాసం మూడవ సోమవారం పూజలు
స్వామివారి ఆలయంలో రద్దీ తగ్గిన భక్తుల సందడి వ్యాపారస్తులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసుల సేవలు అపరిశుభ్రం లోపించకుండా కార్మిక సిబ్బంది సేవలు
కౌతాళం
ప్రముఖ పుణ్య క్షేత్రము అయిన ఈరన్న స్వామి శ్రావణ మాసం మూడవ సోమవారం విశేష దినోత్సవం సందర్భంగా భక్తులు తరలి వచ్చారు. కోరిన వారికి కోరికలు నెరవేర్చే కొలిచే కొంగు బంగారం ఈరన్న స్వామి. భక్తుల పాలిట కోరిన కోర్కెలు తీర్చే కల్ప వృక్షం స్వామి వారి విశేష దినోత్సవన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారి మూల విరాట్ ను పూలు వెండి ఆభరణాలు తో అలంకరించారు. ఉదయం ఏడు గంటల సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏడు గంటల వరకు మంగళ హారతి నిర్యహించరు. ప్రత్యేక రుసుము చెల్లించి అనుమతి పొందిన భక్తుల సమక్షంలో ఎనిమిది నుంచి పది వరకు అవినేటి మండపంలో స్వామి వారికి పంచామృత అభిషేకలు సాయంత్రం ఆరు నుంచి ఏడూ వరకు ధ్వజ స్థంభం వద్ద ప్రకరోత్సవాలు నిర్వహించారు. మధ్యాహ్నం స్వామి వారికి మహా నైవేద్యాన్ని సమర్పించారు. స్వామి వారి దర్శనం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి దర్శననికి వచ్చిన భక్తలకు అన్ని రకాల వసతులు ఆలయ అధికారులు కల్పించారు.దర్శన భాగ్యం ఉదయం 7 నుంచి సాయంత్రం 7గంటల వరకు ఉండటం వల్ల అధిక సంఖ్యలో భక్తులు దర్శన భాగ్యం కలగకుండా వెనుదిరిగారు. బయట నుంచే దేవుని దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు. అవాంచనీయ సంఘటనలు కలగకుండా,సీఐ, పార్థ సారథి , ఎస్ ఐ మన్మధ విజయ్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు.