YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

 వినాయక ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి

 వినాయక ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి

 వినాయక ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి
-- వినాయక విగ్రహాలు ప్రతిష్టించేందుకు పోలీసులు అనుమతి తప్పనిసరి
ప్రతి వినాయక మండపం వద్ద తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు
మండపాల నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
 కోర్టు ఆదేశాల ప్రకారం పూజా సమయంలో తక్కువ మోతాదులో కల్గిన స్పీకర్లను ఏర్పాటు
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
జిల్లా ఎస్పి సిహెచ్.ప్రవీణ్ కుమార్
నిర్మల్,
 విషయం తెలిసి  త్వరలో ప్రారంభమయ్యే వినాయక ఉత్సవాలను నిర్మల్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ సిహెచ్.ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. వినాయక విగ్రహాల ప్రతిష్టాపన మొదలుకొని నిమజ్జనం చేసే వరకు మండపాల నిర్వాహకులు పూర్తి బాధ్యత తీసుకొని ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలు ముగించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. జిల్లాలోని ఏ ప్రాంతం వాసులైన వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకుంటే వారు ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి  అనుమతి తీసుకోవాలని అన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడే ప్రదేశాల్లో గాని రోడ్లపై గానీ వివాదాస్పద ప్రదేశాల్లో గాని విగ్రహాలు ప్రతిష్టించి కూడదని సూచించారు. మండపాల వద్ద విద్యుత్ వినియోగించాలి అంటే తప్పనిసరిగా విద్యుత్ శాఖ వారి అనుమతి తీసుకోవాలని కోరారు. అలాగే ఉత్సవాలు పూర్తయ్యేవరకు మండపాల వద్ద తగినంత సంఖ్యలో వాలంటీర్లను నియమించి 24గంటలు పర్యవేక్షించే చర్యలు చేపట్టాలని సూచించారు. కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మట్టి వినాయక విగ్రహనే ప్రతిష్టాపన చేయాలి, అదేవిధంగా విగ్రహం నియంత్రిత ఎత్తులో ఉండేలా స్థాపించి కావాలి. మండపాల వద్ద పేకాట, జూదం, మద్యం సేవించడం పూర్తిగా నిషేధం అని తెలిపారు. అలాగే మండపాల వద్ద టపాకాయలు మందుగుండు సామాగ్రి నిల్వ చేయకూడదని తెలిపారు. వినాయక ఉత్సవాల నిర్వాహకులు పేర్లు, చిరునామా, మొబైల్ నెంబర్లు సంబంధిత పోలీస్ స్టేషన్లో సమర్పించాలని అన్నారు. ఉత్సవాల సమయంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నాయి, కావున మండపాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటించాలని. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా శబ్ద కాలుష్యం లేని స్పీకర్లను ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే వినియోగించాలని, సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టవద్దని అలాగే పుకార్లను నమ్మవద్దని సూచించారు. ప్రతి వినాయక మండపం వద్ద తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. విగ్రహాల నిమజ్జనం కోసం ఏ రోజు, ఏ మార్గంలో విగ్రహాలు తరలిస్తున్నది సంబంధిత పోలీస్ అధికారులకు లిఖిత పూర్వకంగా తెలియజేయాలని సూచించారు. మండపాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు సంచరించిన ఎలాంటి ఇతర సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని కోరారు. వినాయక ఉత్సవాలు ప్రతి ఒక్కరి విఘ్నాలు తొలగించి ప్రతి ఇంటిలో సుఖ శాంతులు వెల్లివిరిసేలా ముగించుకొని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు.

Related Posts