YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరోనా థార్డ్‌ వేవ్‌ పట్ల ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలి: సోమేశ్‌ కుమార్‌

కరోనా థార్డ్‌ వేవ్‌ పట్ల ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలి: సోమేశ్‌ కుమార్‌

కరోనా థార్డ్‌ వేవ్‌ పట్ల ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలి: సోమేశ్‌ కుమార్‌
హైదరాబాద్‌ ఆగష్టు 23
కరోనా థార్డ్‌ వేవ్‌ ఆలోచన కూడా మనసుల్లో రాకూడదని మూడో ముప్పు రాదని, అయినా ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అన్నారు. కరోనా థార్డ్‌ వేవ్‌ వస్తే ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో కరోనా ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైన్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా ఖైరతాబాద్‌ ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌లో వ్యాక్సినేషన్‌ను సీఎస్‌ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. నగరంలోని 4846 కాలనీల్లో టీకా తీసుకోని వారి గుర్తిస్తున్నామని చెప్పారు. జీహెచ్‌ఎంసీలోని ప్రతి కాలనీకి సంబంధించిన షెడ్యూల్‌ తయారు చేశామని తెలిపారు. వ్యాక్సినేషన్‌ పూర్తయిన ఇంటికి నీరి రంగు స్టిక్కర్‌ అతికిస్తున్నామని చెప్పారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ వల్ల చాలా మంది టీకా వేయించుకోవాడికి వస్తున్నారని చెప్పారు. భయం వల్లే చాలా మంది టీకాకు దూరంగా ఉన్నారని చెప్పారు. వ్యాక్సినేషన్‌ పూర్తయిన కాలనీలకు పత్రాలతోపాటు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. 15 రోజుల్లో ప్రతి వ్యక్తికి ఒక డోసు టీకా పూర్తిచేస్తామన్నారు. నగరంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ పూర్తయిన తర్వాత రాష్ట్రమంతటా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపడతమన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం చేయడంలేదన్నారు.

Related Posts