దాయాది పాకిస్థాన్‌కు జమ్ముకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ అద్భుతమైన సలహా ఇచ్చారు. నిత్యం సరిహద్దుల్లో పోరు చేసేకంటే.. పీఎం మోదీ చెప్పినట్టు పేదరికంపై యుద్ధం చేస్తే బాగుంటుందని సూచించారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఈ విషయాన్ని పాక్ సీరియస్‌గా తీసుకుంటుందని భావిస్తున్నానన్నారు. ఒకరికొకరు కలిసి మెలిసి ఉండటం నేర్చుకోవాలని.. బంకర్ల నిర్మాణం శాశ్వత పరిష్కారం కాదని ముఫ్తీ అన్నారు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలపై మంగళవారం జమ్ముకశ్మీర్ అసెంబ్లీ అట్టుడికింది. ఇవాళ జరిగిన సమావేశంలో దీనిపై ముఫ్తీ మాట్లాడారు.