YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో తాలిబన్ల పేరు

ఏపీలో తాలిబన్ల పేరు

విజయవాడ, ఆగస్టు 24, 
తాలిబన్. ఈ పేరు ఇపుడు విశ్వవ్యాప్తం. ఈ పేరు అంతర్జాతీయంగా మారు మోగుతోంది. ఈ భూగోళం మీద ఉన్న దేశాలు అన్నీ కూడా ఈ పేరుని తెగ తలచుకుంటున్నాయి. ఆఫ్ఘానిస్తాన్ ని చెరబట్టిన తాలిబన్లతో పోలిక ఎవరూ పెట్టుకోరు. కానీ తెలుగు రాజకీయాల్లో మాత్రం తాలిబన్ ఇపుడు కొత్త తిట్టుగా మారిపోయింది. డిక్షనరీలో ఉన్నవీ లేనివీ కలిపి మరీ తిట్టినది తిట్టకుండా తిట్టేసుకున్న వైరి పక్షాలకు ఇపుడు తాలిబన్ క్యాచీ తిట్టుగా తోస్తోంది. అందుకే అటు వైసీపీ ఇటు టీడీపీ రెండూ కూడా ఈ పదాన్ని చాలా ఎక్కువగా వాడేస్తున్నాయి. ప్రత్యర్ధులను తిట్టాలంటే ఇంతకు మించిన పదం వేరేది ఉండదని కూడా భావిస్తున్నట్లుగా ఉన్నాయి. ఏపీలో తాలిబన్ పాలన సాగుతోందని టీడీపీ నేతలు అంటున్నారు. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మొదట ఈ తాలిబన్ పదాన్ని వాడేశారు. ఏపీలో రాక్షస పాలన అంటూ ఇప్పటిదాకా విమర్శించిన తమ్ముళ్ళకు ఇపుడు తాలిబన్ పదం బాగా దొరికేసింది. దాంతో వారు దాని బాగానే ఉపయోగిస్తున్నారు. ఇపుడు అందరి మెదళ్ళల్లో ఈ పదం ఉంది. తాలిబన్ల గురించి కూడా పూర్తి అవగాహన ఉంది. అటెన్షన్ ఉంది. దాంతో ఎటువంటి శ్రమ లేకుండా ప్రత్యర్ధిని బదనాం చేయాలంటే ఇంతకు మించిన విలువైన పదం ఎక్కడా లేదని టీడీపీ ముందుగానే వాడేసింది.మరో వైపు చూస్తే టీడీపీ అంతే కొత్త అర్ధం చెబుతున్నారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. ఆయన అసలే నోరు జోరు ఎక్కువగా చేస్తారు. ఇపుడు తాలిబన్ పదం ఆయనకు కూడా చటుక్కున దృష్టికి వచ్చింది. అంతే తెలుగు తాలిబన్ల పార్టీ అంటూ టీడీపీ గురించి చెప్పేశారు. గతంలో తెలుగు ద్రోహుల పార్టీ అంటూ ఇదే వైసీపీ నేతలు టీడీపీ మీద విమర్శలు చేశారు. ఇపుడు తాలిబన్లను చేర్చి అసలైన రాక్షల పాలన మీదేనంటున్నారు. ఒక పార్టీగా కూడా మీరు తాలిబన్లే అంటూ జోగి రమేష్ పెద్ద నోరు చేస్తున్నారు.ఆఫ్ఘనిస్తాన్ నే తాలిబన్లు ఆక్రమించారు అని అంతా అనుకుంటున్నారు. కానీ వారు ఏపీ రాజకీయాలను కూడా ఆక్రమించేశారు అని వైసీపీ, టీడీపీ నేతల తిట్ల పురాణం చూస్తే అర్ధమైపోతోంది. పైగా తాలిబన్లే నయం అని కూడా ఈ పార్టీల నేతలు అంటున్నారు అంటే అంతకు మించి ఏపీలో రాక్షసులు ఉన్నారు అన్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారన్న మాట. ఏది ఏమైనా భావ దారిద్రం ఉంటే ఉండవచ్చు కాక కానీ ప్రత్యర్ధి మీద మరీ ఇంతలా ఎంగిలి పదాలను తెచ్చి బురద జల్లడం దారుణమైన రాజకీయమే అంటున్నారు చూసిన వారు. ఇక ఈ కధ ఇక్కడితో ఆగేది కాదు చూడబోతే 2024 ఎన్నికల దాకా తాలిబన్లను ఏపీ పార్టీలు వదిలేట్టు లేవు. అంటే ఏపీలో తాలిబన్లు ఇప్పట్లో పోరు అన్న మాటేగా..

Related Posts