హైదరాబాద్, ఆగస్టు 24,
కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డికి సీత్కకు ఉన్న సన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ టీడీపీలో ఉన్నప్పటి నుంచే అన్నా చెల్లెల్లుగా అందరికీ తెలుసు. కాగా ఇప్పడు వీరిద్దరూ కాంగ్రెస్‌లో మొదటి నుంచి మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. రేవంత్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా సీతక్క ఎంతో బాధ్యతగా నిర్వహిస్తుంది. రేవంత్‌రెడ్డికి మొదటి నుంచి అత్యంత నమ్మకస్తురాలిగా సీతక్కకు పేరుంది. సీతక్కకు కూడా ప్రజల్లో మంచి ఇమేజ్ ఉంది. ఆమెకు పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారు.ఇక అంతలా ఇమేజ్ ఉన్న సీతక్క గ్రాఫ్ ఇప్పుడు రేవంత్ టీపీసీసీ చీఫ్ అయ్యాక మరింత పెరుగుతోంది. పార్టీలో ఏ ఇతర నేతలకు ఇవ్వనటువంటి ప్రాముఖ్యతను కేవలం సీతక్కకు ఇస్తున్నారు రేవంత్‌రెడ్డి. టీపీసీసీ చీఫ్ గా రేవంత్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందులో సీతక్కకే ప్రధాన ప్రాముఖ్యత ఉంటోంది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న దళిత, గిరిజన దండోరా కార్యక్రమాలను సీతక్క నాయకత్వంలోనే నిర్వహిస్తున్నారు. అన్ని సభలను సీతక్క ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. ఎవరు మాట్లాడాలన్నా కూడా సీతక్కనే చూసుకుంటోంది.ఇక కాంగ్రెస్ కు పట్టులేనటువంటి వరంగల్ జిల్లాల్లో పెత్తనం మొత్తం సీతక్కకే అప్పగించారు రేవంత్ రెడ్డి. పార్టీలో కూడా రవేంత్ రెడ్డి తర్వాత సీతక్క ఏది చెప్తే అదే అమలు జరుగుతోంది. ఇంకా చె్పాలంటే పార్టీలోని నాయకులు కూడా సీతక్క చెప్పినట్టే వింటున్నారని సమాచారం. త్వరలోనే సీతక్కకు కీలక బాధ్యతలు కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఆదివాసీ బిడ్డకు మంచి గుర్తింపు ఇస్తున్నట్టు గుర్తింపు కూడా వస్తుంది కాబట్టి రేవంత్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆమెకు పబ్లిక్‌లో ఉన్న ఇమేజ్ కారణంగా పెద్దగా సీనియర్లు కూడా విమర్శలు చేయట్లేదు.