YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

నీట్ కు లక్షా ఆరువేల మంది.. ఆరు సెంటర్ లలో పరీక్షలు

నీట్ కు లక్షా ఆరువేల మంది.. ఆరు సెంటర్ లలో పరీక్షలు

దేశ వ్యాప్తంగా అన్ని వైద్య విద్య, దంత కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష అంతా సిద్ధమైంది. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూడు గంటలపాటు నీట్ పరీక్షను నిర్వహించనున్నారు.  104 నగరాల్లో ఈ పరీక్ష జరగనుంది. లక్షలాది మంది హాజరయ్యే నీటి పరీక్ష నిర్వహణ సీబీఎస్ఈ బోర్డు చూస్తోంది. సుప్రీం కోర్టు తీర్పుతో మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్ పరీక్ష తప్పనిసరి అయింది. రాష్ట్రాల ఎంట్రన్స్ టెస్ట్‌లు రద్దయ్యాయి. 

తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ కలిపి లక్షా ఆరువేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి నగరాల్లో, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌లో సెంటర్లు ఉన్నాయి. సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహిస్తారు.నీట్ పరీక్ష ఆధారంగా దేశ వ్యాప్తంగా 412 కాలేజీల్లో 52,715 సీట్లు భర్తీ అవుతాయి. వీటిలో 190 ప్రభుత్వ కాలేజీల్లో 25,880 సీట్లు, 222 ప్రైవేటు కాలేజీల్లో 26,835 సీట్లు ఉన్నాయి. ఇక బీడీఎస్ సీట్ల భర్తీ కూడా ఈ పరీక్ష ఆధారంగానే జరుగుతుంది. రాష్ట్రాల కోటా 85 శాతం పోనూ మిగిలిన 15 శాతం జాతీయ మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఏపీ, తెలంగాణల్లో  2018-19 విద్యా సంవత్సరం నుంచి తమకు సంబంధించిన ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల నుంచి 15శాతాన్ని అఖిలభారత కోటా కింద కేటాయించటానికి అంగీకరించింది. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా అఖిలభారత సీట్లను పొందటానికి అర్హులవుతారు. దీని వల్ల తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశంఉంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులను సీబీఎస్‌ఈనీట్‌ వెబ్‌సైట్‌ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.మొత్తం 180 మార్కులకు పేపర్ ఉంటుంది. బయాలజీ నుంచి 90 ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 45, కెమిస్ట్రీ నుంచి 45 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 720 మార్కులకు పేపర్ ఉంటుంది. నెగిటివ్ మార్కుల కింద ఒక తప్పు జవాబుకు ఒక మార్కు కట్ ఉంటుంది.

పెన్, పెన్సిల్, రబ్బరు వస్తువులేవీ పరీక్ష హాల్‌లోకి అనుమతించరు

డ్రెస్సింగ్‌లోనూ నిబంధనలు 

అబ్బాయిలు కుర్తా, పైజమా, ఫుల్ హ్యాండ్స్ చొక్కా, షూ ధరించకూడదు

లైట్ కలర్ జీన్స్, ప్యాంట్‌లు, హాఫ్ హ్యాండ్స్ షర్ట్స్, స్లిప్పర్స్ ధరించి పరీక్షకు రావాలి

అమ్మాయిలు కూడా పెద్ద పెద్ద బటన్స్, పూసలు ఉన్న వస్త్రాలు, 

హై హిల్స్‌తో వస్తే పరీక్షకు అనుమతించరు

పరీక్ష హాల్‌లో అభ్యర్థులకు పెన్నులను ఇన్విజిలెటర్స్ ఇవ్వనున్నారు

ఉదయం 9.30 తర్వాత ఎవరినీ పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. 

బుర్ఖా ఉంటే గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

ఫుల్ హ్యాండ్స్‌ వేసుకోకూడదు. పొట్టి చేతులు ఉండే దుస్తులు వేసుకోవాలి. 

మొబైల్ ఫోన్లు, క్యాలిక్యూలేటర్, బ్లూతూత్ వంటి గ్యాడ్జెడ్లను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. 

ముక్కుపుడకలు, చైన్లు, చెవి రింగులు, 

దుద్దులు తదితర అభరణాలు వేసుకుని పరీక్షకు రావద్దు. 

 నీళ్ల సీసాలు, తినుబండారాళ్లను అనుమతించరు. 

అడ్మిట్ కార్డ్, రెండు ఫొటోలను తీసుకెళ్తే సరిపోతుంది. 

Related Posts