ముంబై, ఆగస్టు 24,
ఇండియా స్టార్టప్‌లు దూసుకెళ్తున్నాయి. ఇన్వెస్టర్లు వీటిలో కోట్లాది రూపాయల డబ్బు గుమ్మరిస్తున్నారు. మనదేశ స్టార్టప్‌లు/యూనికార్న్‌లు 2021 ఏప్రిల్–-జూన్‌లో సుమారు 6.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.48,329 కోట్లు) నిధులను అందుకున్నాయి. వీటిలో 11 స్టార్టప్‌లు యూనికార్న్ క్లబ్‌లో ప్రవేశించాయని నాస్కామ్–- పీజీఏ ల్యాబ్స్ రిపోర్టు పేర్కొంది. వాల్యుయేషన్ బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉన్న స్టార్టప్‌ను యూనికార్న్ అంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్లో 160 ఫండింగ్ ఒప్పందాలు ముగిశాయి. జనవరి–-మార్చితో పోలిస్తే ఫండింగ్ బాగా పెరిగింది. సీక్వెన్షియల్‌గా చూస్తే జూన్ క్వార్టర్లో సేకరించిన నిధులు 71 శాతం పెరిగాయి. మనదేశంలో అతిపెద్ద డీల్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ 800 మిలియన్ డాలర్ల నిధులను రాబట్టింది. షేర్‌చాట్ ( 502 మిలియన్ డాలర్లు), బైజు ( 340 మిలియన్ డాలర్లు), ఫార్మ్ ఈజీ ( 323 మిలియన్ డాలర్లు) మీషోకు 300 మిలియన్ డాలర్లు వచ్చాయని రిపోర్టు పేర్కొంది. 2021 జూన్ క్వార్టర్లో పైన్ ల్యాబ్స్ 285 మిలియన్ డాలర్లు, డెల్హివరీ 277 మిలియన్ డాలర్లు, జీటా 250 మిలియన్ డాలర్లు, క్రెడ్ 215 మిలియన్ డాలర్లు, అర్బన్ కంపెనీ 188 మిలియన్ డాలర్లు సేకరించాయి.ఈ ఏడాది జూన్ వరకు ఇండియాలో 53 యునికార్న్‌లు ఉన్నాయి. ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఏప్రిల్–-జూన్ క్వార్టర్లోనూ గొప్ప విజయాలను సాధించింది. పెద్ద సంఖ్యలో ఫండింగ్ డీల్స్ కుదుర్చుకుంది. చాలా స్టార్టప్‌లు యునికార్న్ లుగా మారాయి. మంచి-నాణ్యత కలిగిన డిజిటల్ వ్యాపారాలపై ఇన్వెస్టర్లకు నమ్మకం పెరిగింది’’ అని పీజీ ల్యాబ్స్ డైరెక్టర్ అభిషేక్ మైతి చెప్పారు. ఫిన్‌టెక్, ఫుడ్‌టెక్ హెల్త్‌టెక్ వంటి రంగాలు కొవిడ్ ప్రోటోకాల్స్ వల్ల కూడా ప్రయోజనాలు పొందుతున్నాయని, ఇక ముందు కూడా భారీగానే ఒప్పందాలకు అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. తాజా క్వార్టర్లో మొత్తం డీల్స్ విలువలో ఫిన్‌టెక్ సెక్టార్ అత్యధికంగా 27 శాతం నిధులను దక్కించుకుంది. తర్వాత ఫుడ్‌టెక్ (13 శాతం), ఎంటర్‌ప్రైజ్ టెక్ (11 శాతం), ఎడ్‌టెక్ (10 శాతం) మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ సెక్టార్ స్టార్టప్‌లు/యూనికార్న్‌లు 8 శాతం ఫండ్స్‌ను దక్కించుకున్నాయి. మొత్తం డీల్ విలువలో గ్రోత్ స్టేజ్ ఫండింగ్ వాటా 61 శాతం. ప్రారంభ దశలో దాదాపు 100 స్టార్టప్‌లు నిధులు పొందాయి. మొత్తం ఫండింగ్‌లో ఇది 9 శాతం. ఈ ఏడాది జూన్ క్వార్టర్లో - అర్బన్ కంపెనీ, క్రెడ్, మీషో, గ్రోవ్, షేర్‌చాట్, ఫార్మ్ ఈజీ, జీటా, బ్రౌజర్‌స్టాక్, మొగ్లిక్స్, గుప్‌షప్, ఛార్జీబీలు యూనికార్న్ లెవెల్‌కు ఎదిగాయి. దీంతో దేశంలో మొత్తం యునికార్న్‌ల సంఖ్య 53 కి చేరుకుంది. వీటిలో 27 శాతం ఫిన్‌టెక్ స్టార్టప్‌లు కాగా, 18 శాతం స్టార్టప్‌లు సాఫ్ట్‌వేర్ సేవలు , సోషల్ కామర్స్‌కు చెందినవని నాస్కామ్ తెలిపింది.