YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దత్తత గ్రామాలపై రేవంత్ ప్లాన్...

 దత్తత గ్రామాలపై రేవంత్ ప్లాన్...

హైదరాబాద్, ఆగస్టు  24, 
సీఎం దత్తత గ్రామాలపై హస్తం గురి పెట్టింది. ఆయా గ్రామాల్లో దళిత వాడల అభివృద్దిపై ఫోకస్ పెట్టింది. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలో భాగంగా దళిత వాడలను సందర్శించి, అక్కడ జరిగిన అభివృద్దిపై ప్రజలకు వివరించాలని వ్యూహారచన చేస్తోంది. తద్వారా సీఎం దత్తత తీసుకుని సంవత్సరాలు గడుస్తున్నా పల్లెలలో.. దళిత వాడలనే అభివృద్ది చేయని ముఖ్యమంత్రి ఇక దళిత బంధును ఎలా.. ఇస్తాడని సీఎంను టార్గెట్ చేసేలా కాంగ్రెస్ కార్యక్రమాలను రచిస్తోంది.సీఎం కేసీఆర్ మేడ్చల్ జిల్లాలో 2017లో మూడుచింతలపల్లి, కేశవరం, లక్ష్మాపూర్ మూడు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆయన దత్తత తీసుకుని నాలుగేళ్లు కావస్తున్నా మూడుచింతలపల్లి దశ మారలేదు. ధరణి పోర్టల్ ను ఇక్కడే ఆవిష్కరించినా.. ఇదే మండలంలోని లక్ష్మాపూర్ గ్రామ నక్ష సమస్యను తీర్చను లేదు. కేశవపురం సమస్యల వలయంలో కొట్టుమిట్లాడుతోంది. అయితే సీఎం ఇటీవల దత్తత తీసుకున్న వాసాలమర్రిలో దళితులందరికి దళిత బంధును అందజేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 16న ఫైలట్ ప్రాజెక్ట్ గా దళిత బంధును ప్రారంభిస్తామని భావించినా సీఎం.. అంతకు ముందే వాసాలమర్రి గ్రామంలో ఉన్న దళిత కుటుంబాలకు పది లక్షల చొప్పున రూ.7.60 కోట్లను అందజేశారు.అయితే అంతకు ముందు సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న మూడుచింతలపల్లి, కేశవరం, లక్ష్మాపూర్ లలో దళిత బంధును ఎందుకు ఇవ్వడంలేదని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. దీనికి తోడు ఆయన ఎర్రవెల్లి ఫాంహౌజ్ కు వెళ్లే దారిలోనే ఈ మూడు గ్రామాలు ఉండడం విశేషం. దీంతో సీఎంను ఇరుకున పెట్టేందుకు ఈ గ్రామాలను కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. నాలుగేళ్ల కిత్రం దత్తత తీసుకున్న గ్రామాల రూపురేఖలే ఇంకా మారని నేపథ్యంలో సీఎం దళిత బంధు లాంటీ హామీలతో పాటు ఇతర దత్తత గ్రామాల అభివృద్దిపై చర్చను కాంగ్రెస్ పార్టీ లేవనెత్తేంతుదుకు వ్యూహ రచన చేస్తోంది.2017 సంవత్సరంలో సీఎం కేసీఆర్ మూడుచింతలపల్లిలో సభను ఏర్పాటు చేసి గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన స్థలంలోనే కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష వేదికను ఏర్పాటు చేస్తుంది. సీఎం కేసీఆర్ ఇదే స్థలంలో హామీ ఇచ్చి నాలుగేళ్లు గడిచినా.. ఆ మూడు గ్రామాలను ఆశించిన స్థాయిలో అభివృద్ది చేయలేకపోయారని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని నిలదీసే అవకాశం ఉంది.  రెండు రోజుల పాటు దీక్షతో ఆ ప్రాంతంలో పాగ వేయడంతోపాటు తన పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామాలు కూడా కావడంతో సొంత ప్రయోజనాలు కూడా నెరవేరనున్నాయి. అయితే దళిత బంధు రాష్ట్రమంతా అమలు చేయడంతోపాటు గిరిజనులకు సైతం రూ.10 లక్షలు ఇవ్వాలనే డిమాండ్ లేవనెత్తడంతో కాంగ్రెస్ పార్టీ వైపు ఆయా వర్గాలను ఆకర్షించే యోచనలో హస్తం పార్టీ ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Related Posts