హైదరాబాద్
సెప్టెంబర్ 17 తో బిజెపి రాజకీయ చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తుంది. 10నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నామని సి.పి.ఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. పొడు భూముల సమస్య పరిష్కారం కోసం కూర్చి వేసుకున్ని పరిష్కారిస్తామన్నా ముఖ్యమంత్రి మాటలు ఏమయ్యాయి. పోడు భూముల పొరు కై రేపు అల్ పార్టీ నేతలతో సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలపై అన్ని పార్టీలతో పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఇటీవల కేంద్ర కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విపక్షాల సమావేశంలో తాము పాల్గొన్నామని అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పోరాటానికి పిలుపునిచ్చినా సి.పి.ఎం పాల్గొంటుంది. రాష్ట్ర ప్రభుత్వం, నెరవేర్చ లేని హమీలు ఇచ్చి లబ్ది పొందే ప్రయత్నం చేస్తుంది. దళిత బంధువులు హుజురాబాద్ కే పరిమితం కాకుండా రాష్ట్రంలోని దళిత అందరికీ ఇచ్చేలా ప్రభుత్వం ముందడుగు వేయాలి. దళిత బంధు ప్రకటనతో, బీసీ బంధువు, గిరిజన బంధు, మైనార్టీ ఈ వర్గాల వారికి కూడా ఆ తరహా లబ్ధి చేకూర్చే విధంగా డిమాండ్లు వస్తున్నాయి. హుజురాబాద్ లో ఇప్పటి నుంచే హోరాహోరీ పోటీ కనిపిస్తుంది. బి.జె.పిని ఓడించే పార్టీ కే.. హుజురాబాద్ ఉపఎన్నికల్లో మా పార్టీ మద్దతు ఉంటుందని అయన అన్నారు.