అమరావతి
అగ్రిగోల్డ్లో డిపాజిట్ చేసి మోసపోయిన డిపాజిట్దారులకు పాదయాత్రలో, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు నగదు చెల్లింపులు మంగళవారం జరిగాయి. అగ్రిగోల్డ్లో రూ.10వేల లోపు డిపాజిట్ చేసి మోసపోయిన మరో 3.86 లక్షల మంది డిపాజిటర్లకు రూ.207.61 కోట్లను, రూ.10 వేల నుంచి రూ.20వేల లోపు డిపాజిట్ చేసి మోసపోయిన దాదారు 3.14 లక్షల మంది బాధితులకు రూ. 459.23 కోట్లను, గౌరవ హైకోర్టు నిర్దేశించిన విధంగా మొత్తం 7 లక్షలకు పై చిలుకు అర్హులైన అగ్రిగోల్డ్ బాధితులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించి, సీఐడీ ద్వారా నిర్ధారించి రూ.666.84 కోట్లను సీఎం వైయస్.జగన్ క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేసారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పాముల పుష్పశ్రీవాణి, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ అండ్ బి మంత్రి ఎం శంకరనారాయణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, సీఐడీ అడిషనల్ డీజీపీ పీ వీ సునీల్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరు అయ్యారు.