YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో మైండ్ గేమ్ స్టార్ట్...

ఏపీలో మైండ్ గేమ్ స్టార్ట్...

విజయవాడ, ఆగస్టు 25, 
పీలో జగన్ కి జనాదరణ లేనే లేదు అంటోంది టీడీపీ అనుకూల మీడియా. జగన్ పని అయిపోయింది అని టీడీపీ నేతలు పెద్ద సౌండ్ చేస్తున్నారు. ఇక చంద్రబాబు లాంటి వారు అయితే వచ్చే ఎన్నికల్లో 150 సీట్లకు తక్కువ కాకుండా మనమే గెలవబోతున్నామని భారీ స్టేట్మెంట్ లు పార్టీ సమావేశాల్లో ఇచ్చేస్తున్నారు. నెల రోజుల వరకూ ఈ హడావుడి సైకిల్ పార్టీలో లేదు, ఇపుడే సడెన్ గా జగన్ గ్రాఫ్ ఎలా పడిపోయింది, టీడీపీకి ఇంత ధీమా హఠాత్తుగా ఎలా వచ్చింది, ఇంతకాలం మౌనమే మా భాష అన్న మాజీ మంత్రులు ఇపుడు వైసీపీ వారే తమ వైపు క్యూ కడుతున్నారు అని ఎందుకు అంటున్నారు అన్నదే చూడాలిపుడు.ఏపీలో జగన్ బలం తగ్గింది అని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు కానీ ఈ మధ్య వచ్చిన ప్రఖ్యాత ఇండియా టుడే సర్వే మాత్రం జగన్ ర్యాంకుని బాగా తగ్గించేసింది. దానికి వేరే ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కానీ అది ఇపుడు టీడీపీకి దాని అనుకూల మీడియాకు బ్రహ్మాస్త్రంగా మారిపోయింది. ఆ సర్వే వచ్చిన వెంటనే లోకల్ యాప్ సర్వే అంటూ మరోటి టీడీపీ వారు సోషల్ మీడియాలో వదిలిపెట్టారు. ఈ సర్వే ప్రకారం ఏకపక్షంగా టీడీపీ ఏపీలో గెలుస్తుందిట. ఇలా వారానికో సర్వేను ఇక మీదట వదులుతారని అంటున్నారు. అంటే దీని అర్ధం పరమార్ధం ఒక్కటే. ఏపీలో జగన్ గాలి పూర్తిగా పోయింది అని చెప్పడమే.ఇక సందట్లో సడేమియా అన్నట్లుగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు కూడా ఒక సర్వే చేశామని చెబుతున్నారు. ఆ సర్వే ప్రకారం చూస్తే ఇప్పటికిపుడు ఏపీలో ఎన్నికలు పెడితే వైసీపీకి యాభై సీట్లు మాత్రమే వస్తాయట. అన్నింటి కంటే ఆశ్చర్యం ఏంటి అంటే నర్సాపురం ఎంపీ సీటులో తాను జగన్ పోటీ చేస్తే జగన్ దారుణంగా ఓడిపోతాడు అని రఘురామ జోస్యం వదులుతున్నారు.మరి ఇది ఎంతవరకూ నిజం అంటే తాను గట్టిగానే సర్వే చేయించాను అని ఆయన చెప్పుకుంటున్నారు. జగన్ మేలు కోరే కార్యకర్తను అని సెటైరికల్ గా చెప్పుకునే రఘురామ సర్వే సారం ఇదన్న మాట.ఏపీలో టీడీపీ భేషైన పాలన, జగన్ అసమర్ధత రెండూ ప్రజల ముందు ఉన్నాయని చంద్రబాబు అంటున్నారు. ఈసారి జనాలకు ఏం చెప్పకపోయినా కూడా టీడీపీకే వారు ఓటు వేస్తారు అని కూడా బాబు అంటున్నారుట. మొత్తానికి సర్వేల ప్రభావమో మరేమో తెలియదు కానీ చంద్రబాబు మాత్రం కళ్ళు మూసుకుంటే చాలు టీడీపీ రాజ్యం వచ్చేసినట్లే అంటున్నారుట. మరి ఏపీలో ఇదే ఏడాది వరసగా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఏక పక్ష విజయాలు, తిరుపతి ఉప ఎన్నికలో బంపర్ విక్టరీ ఇవన్నీ గాలికి కొట్టుకుపోవాల్సిందేనా. ఏపీలో వైసీపీ పని అయిపోయింది. ఆ పార్టీ నేతలే మా వద్దకు వస్తున్నారు అంటూ మాజీ హోం మంత్రి చినరాజప్ప తాజాగా చేస్తున్న ప్రకటనలకు అర్ధమేంటి. ఇదంతా మైండ్ గేమ్ లో భాగమా. లేక టీడీపీకి నిజంగా పెరిగిన బలమా. లేక అనుకూల మీడియా రాతలతో వచ్చినా వాపా? వేచి చూడాల్సిందే.

Related Posts