YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కాపులు కామ్ అయిపాయారే...

కాపులు కామ్ అయిపాయారే...

కాకినాడ, ఆగస్టు 25, 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజికవర్గం బలంగా ఉంది. గెలుపోటములను శాసించే స్థితిలో ఉంది. అయినా గత రెండున్నరేళ్లుగా కాపుల వాయిస్ రాష్ట్రంలో పెద్దగా విన్పించడం లేదు. నిజం చెప్పుకోవాలంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు నేతలు సైలెంట్ అయ్యారు. కాపు రిజర్వేషన్ల అంశం మరుగున పడిపోయింది. మొన్నటి వరకూ ఈ అంశాన్ని భుజానికెత్తుకున్న ముద్రగడ పద్మనాభం సయితం కాడి వదిలేశారు. ఇటీవల జగన్ ప్రభుత్వం ఈబీసీలకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై కూడా కాపుల నుంచి స్పందన లేదు. చంద్రబాబు అధికారంలో ఉండగా కాపు సామాజికవర్గం నుంచి నిత్యం విమర్శలే విన్పించేవి. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం మొదలు కొని ఛోటా మోటా నేతల వరకూ ఒంటికాలు మీద లేచేవారు. చంద్రబాబు కాపు వ్యతిరేకి అన్న ముద్రను బలంగా వేయగలిగారు.జగన్ తన పాదయాత్ర సమయంలోనే కాపు రిజర్వేషన్లు తన పరిధిలో లేవని చెప్పారు. అది తన వల్ల కాదని కూడా తేల్చి చెప్పారు. అయినా ఎన్నికల్లో కాపు సామాజికవర్గం జగన్ వెంటే ఉందన్నది అర్థమవుతుంది. ఇక కాపు సామాజికవర్గానికి జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల్లో వారికి సముచిత స్థానం కల్పిస్తున్నారు. బలమైన కాపు నేతలంతా ఇప్పుడు వైసీపీలో చేరిపోయారు. పదవులను పొందారు. అందుకే కాపు రిజర్వేషన్ల అంశం మరుగున పడింది. అదే సామాజికవర్గానికి చెందిన పవన్ కల్యాణ్ సయితం కాపు రిజర్వేషన్ల గురించి పెద్దగా పట్టించుకోక పోవడం కూడా జగన్ కు కలసి వచ్చిందనే చెప్పాలి. పదవులు పొందిన వారు మౌనంగా ఉండగా, విపక్షంలో ఉన్న నేతలు సయితం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ అంశాన్ని పక్కన పెట్టారు. మొత్తం మీద జగన్ హయాంలో కాపులు కామ్ గా ఉండటానికి కారణం పదవులను ఎరవేయడమేనన్న విమర్శలు విన్పిస్తున్నాయి

Related Posts