లగ్జరీ కార్ కంపెనీలలో మెర్సిడెజ్ బెంజ్ ఒక్కటి. ఈ కంపెనీ నుంచి తాజాగా దేశీయ మార్కెట్లోకి ఎఎంజి ఇ-63 ఎస్ సెడాన్ కారు విడుదల అయింది. దీని ప్రారంభ ధర రూ.1.5 కోట్లు. ఈ కారు తో కలిపి ఇప్పుడు వరకు 14 ఎఎంజి మోడల్ కార్లను మెర్సిడెజ్ కంపెనీ దేశీయ మార్కెట్లోకి దింపింది. భారత మార్కెట్లో మేము ఆఫర్ చేస్తున్న ఎఎంజి మోడళ్లకు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తుందని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ రోలాండ్ ఫోల్గర్ తెలిపారు.