నర్సీపట్నం
పాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వల్ల నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు టాక్స్ లు విపరీతంగా పెరిగాయని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. వీటిని నియంత్రించే క్రమంలో ఈ నెల 28 శనివారం అన్ని వర్గాలతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళన కార్యక్రమం చేపడుతోంది. గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి మహిళల కళ్లల్లో నీళ్లు తెప్పిస్తున్నారు. వీరికి బుద్ది చెప్పాలంటే రెండ్రోజుల్లో జరిగే ఆందోళన కార్యక్రమం అందరూ విజయవంతం చేయాలి. నర్సీపట్నంలో సీబీఎం కాంపౌండ్ నుంచి ర్యాలీగా బయలుదేరి, ఆందోళన జరగనుందని అయన అన్నారు.