YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుకు పీకేనే అడ్డు

చంద్రబాబుకు పీకేనే అడ్డు

హైదరాబాద్, ఆగస్టు 25, 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహాల్లో దిట్ట. ప్రస్తుతం ఆయన ఆలోచనలన్నీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైనే. చంద్రబాబు కాంగ్రెస్ కూటమితో జట్టు కట్టాలని ఉన్నా ఇప్పుడు సాధ్యమయ్యే అవకాశాలు కన్పించడం లేదు. ఇందుకు ప్రశాంత్ కిషోర్ కారణంగా చెబుతున్నారు. కాంగ్రెస్ లో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కీలక భూమిక పోషించే అవకాశాలున్నాయి. పీకే దృష్టి అంతా జగన్ పైనే ఉంటుంది.గత తెలంగాణ ఎన్నికల సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. కూటమిలో చేరారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. స్వయంగా ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలసి వచ్చారు. అప్పుడు మోదీ క్రేజ్, ఇమేజ్ బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు బీజేపీకి బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. మోదీ పై వ్యతిరేకత క్రమంగా పెరుగుతూ వస్తుంది. నిజానికి ఇదే కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు చంద్రబాబుకు మంచి సమయం.అయితే రాష్ట్ర పరిస్థితులు ఆయనను వెనక్కు లాగుతున్నాయి. కాంగ్రెస్ తో జట్టుకట్టి వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ చేత ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇప్పించాలని చంద్రబాబు తొలుత అనుకున్నారు. కానీ కాంగ్రెస్ కు ఏపీలో పెద్దగా ఓటు బ్యాంకు లేదు. బీజేపీ అయితే అన్ని రకాలుగా దన్నుగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే పెట్రోలు, డీజిల్ రేట్లు పెరుగుతున్నా చంద్రబాబు మాత్రం నోరు మెదపడం లేదు. అయితే బీజేపీ పై ఉన్న వ్యతిరేతతో కాంగ్రెస్ కు దగ్గరవ్వాలని కూడా భావించారు.కానీ కాంగ్రెస్ లో ప్రశాంత్ కిషోర్ కీలకంగా మారడంతో చంద్రబాబు తన వైఖరిని మార్చుకున్నారని తెలిసింది. బీజేపీతో అయితే జనసేన కలసి వస్తుందని, అందువల్ల జగన్ ను ఢీకొనడం సాధ్యమవుతుందన్నది చంద్రబాబు భావన. మరోవైపు కాంగ్రెస్ తో జట్టు కట్టడం కూడా పార్టీలో సీనియర్ నేతలు అంగీకరించడం లేదు. ఇటు పీకే అడ్డంకిగా మారడం, సీనియర్ నేతలు ఒప్పుకోక పోవడంతో చంద్రబాబు కుదిరితే బీజేపీతోనే ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించారు.

Related Posts