ముంబై, ఆగస్టు 25,
బిట్‌కాయిన్ మళ్లీ 50 వేల డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసింది. క్రిప్టో కరెన్సీలకు సంబంధించి పాజిటివ్ న్యూస్ వస్తుండడంతో బిట్‌కాయిన్, డోజ్‌కాయిన్, ఎథరమ్, స్టెల్లర్, కార్డొనా, బైనాన్స్ కాయిన్ వంటి క్రిప్టోలు భారీగా పెరుగుతున్నాయి. మార్కెట్ క్యాప్ పరంగా నెంబర్ వన్ వర్చువల్ కరెన్సీ అయిన బిట్‌కాయిన్, మూడు నెలల్లో మొదటి సారిగా సోమవారం 50 వేల డాలర్ల మార్క్‌ను టచ్ చేసింది. ఈ క్రిప్టో సోమవారం 2.65 శాతం ఎగిసి 50,430 డాలర్ల (రూ. 37.43 లక్షలు) వరకు చేరుకుంది. ఎథరమ్ కూడా 2.70 శాతం లాభపడి 3,344 డాలర్ల (రూ.2.48 లక్షల) ను టచ్ చేసింది. క్రిప్టో కరెన్సీలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని, పర్సనల్‌గా బిట్‌కాయిన్, ఎథరమ్, డోజ్‌కాయిన్లను కొనుగోలు చేశానని కిందటి నెలలో బిలియనీర్ ఎలన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. కంపెనీలు తమ బ్యాలెన్స్ షీట్‌కు బిట్‌కాయిన్‌ను యాడ్ చేసుకోవడంపై ఆలోచించాలని ఆర్క్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఎల్‌ఎల్‌సీ సీఈఓ క్యాథి వుడ్ కూడా సలహాయిచ్చారు. ఈ ప్రకటనలు క్రిప్టో కరెన్సీలపై పాజిటివ్ సెంటిమెంట్‌ను పెంచాయని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. క్రిప్టోకరెన్సీ సెక్టార్‌లోకి అమెజాన్ ఎంటర్ అవుతుందనే వార్తలు, యూకేలోని కస్టమర్లు బిట్‌కాయిన్ కొనడానికి, అమ్మడానికి, హోల్డ్ చేయడానికి పే పాల్ హోల్డింగ్స్ అవకాశం కల్పించనుండడం క్రిప్టోల ర్యాలీకి కారణమవుతున్నాయి. యూఎస్‌కు వెలుపల పేపాల్ ఈ ఫీచర్‌ను విస్తరించాలని చూస్తోంది.చైనాలో క్రిప్టో కరెన్సీకి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం, టెస్లా బిట్‌కాయిన్ పేమెంట్లను తీసుకోదని ఎలన్ మస్క్ ప్రకటించడం, అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజి బైనాన్స్‌పై వివిధ దేశాల్లో రెగ్యులేషన్స్ పెరగడం, క్రిప్టోల్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడం..వీటన్నిటితో ఈ ఏడాది మే తర్వాత క్రిప్టోలు పడడం చూశాం. ఈ ఏడాది జులైలో 30 వేల డాలర్ల (రూ. 22.12 లక్షల) కిందకు బిట్‌కాయిన్ పడింది. ఆ తర్వాత రికవరీ అయ్యి 30–40 వేల డాలర్ల మధ్య కదలాడిన ఈ క్రిప్టో కరెన్సీ, పాజిటివ్ న్యూస్ రావడం, తో ఈ నెల ప్రారంభంలో 40 వేల డాలర్లను క్రాస్ చేయగలిగింది. సోమవారం 50 వేల డాలర్ల (రూ. 37.11 లక్షల) మార్క్‌ను కూడా ఈజీగా బిట్‌కాయిన్ దాటింది. మార్కెట్ క్యాప్ పరంగా రెండో అతిపెద్ద క్రిప్టో అయిన ఎథరమ్ కూడా ఈ ఏడాది జులైలో 1,786 డాలర్ల (1.32 లక్షల) వరకు తగ్గింది.