అనంతపురం
అనంతపురం జిల్లా నార్పల మండలం శ్రీ గూగుడు కుళ్లాయిస్వామి పేరు తో ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేశారని నార్పల ఎస్సై వెంకట ప్రసాద్ వెల్లడించారు. గూగూడు స్వామి భక్త మహాశయులకు విజ్ఞప్తి గూగుడు కుల్లాయిస్వామి ఫేసుబుక్ అకౌంట్ నందు స్వామి వారి చావిడి ఒక ప్రక్కన కూలిపోయిందని పెట్టిన పోస్ట్ అవాస్తవమని అన్నారు. భక్తాదులేవరు దీనికి స్పందించి ఎవరు వాళ్ళు చెప్పిన ఫోన్ నెంబర్ కు నగదు పంపవద్దని సూచించారు. ఏమైనా విరాళాలు ,కానుకలు సమర్పించవలసిన వారు ఆలయ కార్యనిర్వహణాధికారి కానీ ఆలయ సిబ్బందికి అందజేసి తగిన రసీదు పొందవలసిందిగా కోరారు. ఇలాంటి వాటికి పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటుకల పల్లి సిఐ భాస్కర్ గౌడ్ హెచ్చరించారు.