శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా ఏచ్చెర్ల మండలం అక్కివలస గ్రామ పరిధిలో ఉన్న నాగార్జున అగ్రికెమ్ లిమిటెడ్ విస్తరణలో భాగంగా ఈ రోజు కాలుష్య నియంత్రాని మండలి ప్రజాభిప్రాయ నిర్వహించారు. ప్రజలనుంచి పూర్తిగా వ్యతిరేకత వస్తుందని ముందస్తు భారీగా పోలీసులు మొహరించారు. సభకి వచ్చే ప్రజలు పోలీసులు ను చూసి బయపడి వెనక్కి వెళ్లిపోయారు. ఇప్పటికే గాలి, నీరు, భూగర్భజలాలు, కెమికల్స్ తో కలుషితం అయ్యాయి. త్రాగడానికి నీళ్లు లేక కిలో మీటర్ల దూరం నడిచి వెళ్ళి తీసుకువస్తున్నాం. ఇప్పుడు కంపేని విస్తరణ జరుగుతుందని చెబుతున్నారు. ఈ కంపేని విస్తరణ మాకొద్దని స్థానిక గ్రామస్థులు డిమంగ్ చేస్తున్నారు.